YS sharmila: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు మారనున్నాయా? అంతకు ముందే ఆ అధ్యక్ష బాధ్యతల నుంచి వైఎస్ షర్మిల తప్పుకోనున్నారా? తన సోదరుడైన వైసీపీ అధినేత చెంతకు చేరనున్నారా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ అనుయాయులైన కొంతరు సీనియర్లు అన్నాచెల్లెళ్లను కలిపేందుకు ప్రయత్నం చేశారని, అది ఫలించిందని విశ్వసనీయ సమాచారం.
YS sharmila: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎదగడం లేదని, నాయకత్వలోపమూ ఒక కారణమని ఆ పార్టీ అధిష్టానం భావించినట్టు తెలుస్తున్నది. ఈ దశలోనే వైఎస్ షర్మిలను తప్పించి, కాపు వర్గం నేతకు పార్టీ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ దశలో వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని భావించారని ప్రచారం జరిగింది. అయితే అంతకు ముందే ఆమె పార్టీని వీడుతారని తెలుస్తున్నది.
YS sharmila: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తన సోదరుడైనా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు సరైన ప్రాతినిథ్యం ఇవ్వలేదని, తండ్రి ఆస్తిలో కూడా తనకు సరైన న్యాయం దక్కలేదని వైఎస్ షర్మిల వైసీపీ నుంచి దూరమయ్యారు. ఆ దశలో ఆమె కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. అనూహ్య పరిణామాల మధ్య ఆమె ఏపీ అధ్యక్ష పదవి చేపట్టి ఎన్నికలకు వెళ్లినా ఆ పార్టీ ఆశించిన ఫలితాలు దక్కించుకోలేకపోయింది.
YS sharmila: ఆ తర్వాత గత ఎన్నికలకు ముందు తన సోదరుడైన వైఎస్ జగన్‌పై ఆమె ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిర్మొహమాటంగా బాణాలను ఎక్కుపెట్టారు. ప్రభుత్వంలో లొసుగులను ప్రజల ముందుంచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
YS sharmila: ఈ పరిణామంతో అటు అధికార పార్టీతో పొసగక, ఇటు ప్రతిపక్ష వైసీపీతో కలిసి ఉండలేక షర్మిల ప్రతిపక్ష పాత్ర పోషించలేక చేతులెత్తేసినట్టుగా భావిస్తున్నారు. ఈ దశలో తన మనుగడ కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే వైఎస్సార్ సమకాలికులైన కొందరు సీనియర్లు అన్నాచెల్లెళ్లను కలపాలని భావించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు వారి సూచన మేరకు ఆస్తి తగాదాలను పరిష్కరించి, ఇద్దరినీ ఒక్కటి చేసేందుకు చొరవ చూపినట్టు సమచారం.
YS sharmila: ఈ నేపథ్యంలో ఇటీవల వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైస్ షర్మిల శుభాకాంక్షలు తెలుపడం కీలక పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి ప్రతిగా జగన్ కూడా సోదరభావంతో స్పందించడం వారి కలయికకు సుపరిణామంగా చెప్తున్నారు. ఈ దశలో త్వరలోనే అధికారికంగా వైస్ షర్మిల కాంగ్రెస్ రాజీనామా ప్రకటన వెలువడుతుందని, ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకొని అన్న బాటలో పయనించనున్నదని విశ్లేషిస్తున్నారు.
