Alpha Trailer

Alpha Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న ‘ఆల్ఫా’ ట్రైలర్..! సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన హృతిక్ రోషన్

Alpha Trailer: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త యాక్షన్ ట్రెండ్‌ను సెట్ చేసిన ‘వైఆర్ఎఫ్ (YRF) స్పై యూనివర్స్’ నుండి మరో మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ‘ఏక్ థా టైగర్’, ‘వార్’, ‘పఠాన్’ వంటి భారీ ఇండస్ట్రీ హిట్ల తర్వాత.. నిర్మాత ఆదిత్య చోప్రా ఈసారి మరింత పవర్‌ఫుల్ విజువల్స్, లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో ‘ఆల్ఫా‘ (Alpha) అనే హై-ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ను లైన్లోకి తెచ్చారు. బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్, యంగ్ సెన్సేషన్ శార్వరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

‘సీత’గా ఆలియా వైల్డ్ యాక్షన్ – బాబీ డియోల్ అండ:

ట్రైలర్‌ను గమనిస్తే.. ఈ సినిమా కథను రామాయణం స్ఫూర్తితో ఎంతో ఇంటెన్స్‌గా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో ‘సీత’ అనే అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా ఆలియా భట్ మునుపెన్నడూ చూడని క్రూరమైన యాక్షన్ అవతారంలో కనిపించింది. తుపాకులు పట్టి, డెడ్లీ స్టంట్స్ చేస్తూ థియేటర్లలో ఫైర్ పుట్టించడం ఖాయమనిపించేలా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది.

గతంలో ఒక సీక్రెట్ ఆపరేషన్‌లో గాయపడిన సీతను కాపాడి, భారతదేశపు తదుపరి తరం సైనికులను తయారు చేసే అత్యంత రహస్య ప్రోగ్రామ్ ‘ఆల్ఫా’ కోసం ఆమెను ఒక అస్త్రంలా తీర్చిదిద్దిన ‘బాబా’ పాత్రలో విలక్షణ నటుడు బాబీ డియోల్ తన మార్క్ నటనతో మెప్పించాడు.

శార్వరి వర్సెస్ ఆలియా.. అనిల్ కపూర్ మార్క్:

ఇక సీతను అడ్డుకోవడానికి రంగంలోకి దిగిన మరో డేరింగ్ అండ్ డైనమిక్ ఇండియన్ ఏజెంట్‌గా శార్వరి అద్భుతమైన యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకుంది. ట్రైలర్‌లో ఈ ఇద్దరు భామల మధ్య వచ్చే ఇంటెన్స్ ఛేజింగ్‌లు, గన్ ఫైట్లు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. వీటన్నింటినీ వెనక ఉండి నడిపించే భారత రక్షణ విభాగం కమాండర్‌గా సీనియర్ నటుడు అనిల్ కపూర్ తనదైన మేనరిజంతో ఇరగదీశారు.

‘వార్’ కబీర్ సర్‌ప్రైజ్ క్యామియో.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

గొర్రెలా కాదు… తోడేలులా జీవించాలి అనే పవర్‌ఫుల్ డైలాగ్స్ ఒకెత్తయితే, YRF స్పై యూనివర్స్ ఫ్యాన్స్ అస్సలు ఊహించని రేంజ్ సర్‌ప్రైజ్ ఒకటి ట్రైలర్ చివర్లో మేకర్స్ ప్లాన్ చేశారు. ‘వార్’ సినిమాలో కబీర్‌గా బాక్సాఫీస్ రికార్డులను వేటాడిన గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్.. ఈ మూవీలో క్యామియో రోల్‌లో ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా సినిమాపై క్రేజ్‌ను స్కై-హై లెవెల్‌కు తీసుకెళ్లాడు.

‘ది రైల్వే మెన్’ సిరీస్ ఫేమ్ శివ్ రావల్ అద్భుతమైన టేకింగ్‌కు, రోహన్ష్-అబీర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) తోడై ట్రైలర్‌కు ప్రాణం పోశాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2026 జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ట్రైలర్ ఇక్కడ క్లిక్ చేసి చుడండి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *