Youtuber Anesh Case: తన వీడియోల ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక అప్‌డేట్ వచ్చింది. సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కల్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు యాక్షన్ మొదలుపెట్టారు. భారతదేశ మహిళలపై, హిందూ దేవతలపై అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇప్పటికే హిందూ సంఘాలతోపాటు భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు రగిలిపోతున్నారు.
Youtuber Anesh Case: నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు, తదితర పేర్లతో అన్వేష్ అనే వ్యక్తి యూట్యూబ్, ఇన్‌స్టా వేదికలుగా వీడియోలు పోస్టు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఇప్పటికే గతంలో కూడా ఎందరినో వ్యక్తిగతంగా దూషిస్తూ, వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వ్యంగంగా చిత్రీకరిస్తూ అతను వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
Youtuber Anesh Case: ఇటు నటుడు శివాజీతోపాటు శతావధాని గరికపాట నర్సింహారావులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఇదే ఫ్లోలో హిందూ దేవతలపై, హిందూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. వెంటనే అన్వేష్‌ను దేశానికి రప్పించాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
Youtuber Anesh Case: ఈ నేపథ్యంలో యూట్యూబర్ అన్వేష్‌పై హైదరాబాద్ పంజాగుట్ట సహా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు నటి కల్యాణి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణకు దిగారు. దీనిలో భాగంగా ఏకంగా ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులకు పోలీసులకు లేఖ రాశారు. అన్వేష్ యూజర్ ఐటీ వివరాలు కావాలంటూ ఆ లేఖలో కోరారు. ఇప్పటికే అన్వేష్‌ను భారత్‌కు రప్పించే పనిలో పడ్డారని తెలుస్తున్నది. అంతర్జాతీయ చట్టాలను అనుసరించి అయినా అతన్ని రప్పించే అవకాశం ఉన్నదని పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
