Gukesh Dommaraju: ప్రపంచమంతా ఇప్పుడు ఒక భారతీయుడి పేరు మారుమోగిపోతోంది. అంతర్జాతీయ మీడియాలో ఈ తెలుగోడి పేరు మోతెక్కుతోంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఈపేరును తెగ వెతికేస్తున్నారు. ఇంత సంచలనం సృష్టిస్తున్న ఆపేరు గుకేష్ దొమ్మరాజు. వయసు కేవలం 18 ఏళ్లు. ఏమిటి సాధించాడు.. ఇంతగా చెప్పుకోవడానికి అనుకుంటున్నారా. అదే చెప్పబోతున్నాం. గుకేష్ మామూలు విజయం సాధించలేదు. ప్రపంచ చెస్ సామ్రాజ్యంలో అతిపిన్న వయస్కుడైన చాంపియన్ గా విజయకేతనం ఎగురవేశాడు. ప్రతి భారతీయుడి గుండెను ఉప్పొంగేలా చేశాడు. ఇంకా చెప్పాలంటే గ్యారీ కాస్పరోవ్ అంతటి చెస్ దిగ్గజం పెరిగినా ఉన్న గ్రాండ్ మాస్టర్ రికార్డును బద్దలు కొట్టి చెస్ చరిత్రలోనే చారిత్రాత్మక విజయాన్ని సాధించాడు. భారతీయుడిగా ప్రపంచ చెస్ సామ్రాజ్యంపై విశ్వనాధ్ ఆనంద్ తరువాత రెండో చాంపియన్ గా నిలిచి సంచలనం సృష్టించాడు. గుకేష్ పుట్టింది చెన్నైలో అయినా.. తెలుగువాడే! ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ కిరీటాన్ని తలకెత్తుకున్న మన తెలుగింటి కుర్రాడి గురించి తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Sai Pallavi ఇక సహించేది లేదన్న సాయిపల్లవి!
Gukesh Dommaraju:గుకేష్ పూర్తి పేరు దొమ్మరాజు గుకేష్. అతను రజనీకాంత్ – పద్మ దంపతులకు చెన్నైలో జన్మించాడు. తండ్రి వృత్తి రీత్యా ఈఎన్టీ స్పెషలిస్ట్.. తల్లి మైక్రోబయాలజిస్ట్. తండ్రి రజనీకాంత్ క్రికెట్ ప్లేయర్. కాలేజీ రోజుల్లో క్రికెట్ ఆడేవారు. రాష్ట్ర స్థాయి ఎంపిక కోసం ట్రయల్స్ కూడా ఇచ్చారు. అయితే కుటుంబ ఒత్తిడి కారణంగా క్రికెట్‌ను వదిలి మెడిసిన్ చదవడం ప్రారంభించారు
గుకేష్ 7 సంవత్సరాల వయస్సు నుండి చెస్ ఆడటం ప్రారంభించాడు. కొడుకు అభిరుచిని చూసి రజనీకాంత్ చాలా ఇన్స్పైర్ అయ్యాడు. ఆటలు చదువులను బ్యాలెన్స్ చేయడంలో ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు నాలుగో తరగతి తర్వాత రెగ్యులర్ చదువుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో, రజనీకాంత్ మాట్లాడుతూ, గుకేశ్ ప్రొఫెషనల్ చెస్ ఆడటం ప్రారంభించినప్పటి నుండి పరీక్షలు రాయలేదు.
గుకేష్ కెరీర్ కోసం ఉద్యోగాన్ని వదిలేసిన తండ్రి..
Gukesh Dommaraju: గుకేష్‌ని ఇక్కడికి తీసుకురావడానికి, అతని తల్లిదండ్రులు కూడా చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. గుకేశ్ చెస్‌లో మెరుగ్గా ఉండటం ప్రారంభించినప్పుడు, వృత్తిరీత్యా వైద్యుడైన అతని తండ్రి తన ఉద్యోగాన్ని వదిలివేయవలసి వచ్చింది. వాస్తవానికి, విదేశాలలో జరుగుతున్న టోర్నమెంట్‌ల కారణంగా ఆయన క్లినిక్ సరిగా నడిపే పరిస్థితి లేదు. దీంతో దానిని వదిలేసి.. పూర్తి సమయం కొడుకుతోనే ఉండిపోయారు. క్లినిక్ మూతపడటంతో అతని ఆదాయం అంతంతమాత్రంగా మారింది. గుకేశ్ టోర్నీ, కుటుంబ ఖర్చుల భారం తల్లి పద్మపై పడింది. ఆ సమయంలో విదేశాల్లో టోర్నీలు ఆడేందుకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండగా గుకేష్‌కు స్పాన్సర్లు లభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీలో పాల్గొనేందుకు చాలాసార్లు అప్పు చేయాల్సి వచ్చింది.
ఒక ఇంటర్వ్యూలో, గుకేశ్ తండ్రి రజనీకాంత్ విదేశీ టోర్నమెంట్ విషయంలో జరిగిన ఒక సంఘటన చెప్పారు. వారు 2021లో గుకేష్‌ను యూరప్‌కు తీసుకెళ్లినప్పుడు, వారు భారతదేశానికి తిరిగి రావడానికి దాదాపు 4 నెలల సమయం పట్టింది. నిజానికి ఈ కాలంలో గుకేశ్ 13 నుంచి 14 టోర్నీలు ఆడాడు. అతను 3 సార్లు ఫ్లైట్ మిస్ అవ్వాల్సి వచ్చింది. ఇక గుకేష్‌కి చెస్‌తో పాటు క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలంటే చాలా ఇష్టం. ఫుడ్ కూడా చాలా ఇష్టం.
ఇద్ కూడా చదవండి:World Chess Championship 2024: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో గ్రాండ్ మాస్టర్ గుకేశ్ సంచలనం..
కలిసొచ్చిన కరోనా కాలం..
Gukesh Dommaraju: గుకేష్ ఒక సంవత్సరంలో సుమారు 250 టోర్నమెంట్ మ్యాచ్‌లు ఆడాడు. యూరప్‌లో ఒక టోర్నమెంట్ సమయంలో డబ్బు ఆదా చేసుకోవడానికి విమానాశ్రయంలోనే తన తండ్రితో కల్సి పాడుకోవాల్సి వచ్చింది. 2020లో కరోనా కాలం గుకేష్ కుటుంబానికి ఆర్థికంగా చాలా వెసులుబాటు లభించింది. ఎందుకంటే, అప్పుడు చెస్ టోర్నమెంట్స్ అన్నీ ఆన్‌లైన్‌లో జరిగాయి. ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి తప్పింది. దీంతో ప్రయాణ ఖర్చులు కలిసొచ్చాయి. అంతేకాకుండా సమయం దొరకడంతో అతని తండ్రి మళ్ళీ ఆసుపత్రిని ఓపెన్ చేయగలిగారు. దీంతో ఆర్ధిక పరిస్థితి మెరుగైంది.
అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఛాంపియన్ గా..
Gukesh Dommaraju: గుకేష్ కు చెస్ పై ఉన్న ఏకాగ్రత పట్టుదల చూసిన స్కూల్ టీచర్స్ కూడా ప్రోత్సహించారు. స్కూల్ కోచ్ భాస్కర్ ప్రొఫెషనల్ గా చెస్ ఆడడం ఎలానో నేర్పించారు. 2013 నుంచి చిన్న చిన్న టోర్నమెంట్స్ లో పాల్గోవడం మొదలు పెట్టాడు గుకేష్. రెండేళ్లలో అంటే 2015 నుంచి ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్ గా తన ఉనికిని చాటుతూ వచ్చాడు. అండర్ 9 సెక్షన్ ఏషియన్ స్కూల్ చెస్ ఛాంపియన్ గా వరల్డ్ యూత్ ఛాంపియన్ గా సంచలనాలు నమోదు చేశాడు. తరువాత రెండేళ్ళకి అంటే 2017లో క్యాపెల్లే లా గ్రాండ్ ఓపెన్ లో ఇంటర్నేషనల్ మాస్టర్ గా ఎదిగాడు. మళ్ళీ రెండేళ్లలో 2019 జనవరి 15న అత్యంత పిన్నవయస్కుడైన రెండో గ్రాండ్ మాస్టర్ గా రికార్డు సృష్టించాడు. అల మొదలైన గుకేష్ చెస్ ప్రస్థానం ఇప్పుడు ఇంతై వటుడింతై అన్నట్టు ప్రపంచ చెస్ చాంపియన్ గా చరిత్ర సృష్టించాడు.
గ్యారీ కాస్పరోవ్ రికార్డ్ చెదరగొట్టేశాడు..
Gukesh Dommaraju: ప్రపంచంలో చెస్ అంటే ఠక్కున గుర్తు వచ్చేపేరు గ్యారీ కాస్పరోవ్. ఆయన చిన్న వయసులో అంటే తన 22 ఏళ్ల వయసులోనే 1985లో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు మన గుకేష్ తన 18 ఏళ్ల వయసులో ప్రపంచ చెస్ కిరీటాన్ని గెలిచి కొత్త చరిత్రను రాశాడు. గత ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరెన్ పై ఘన విజయం సాధించి ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ -2024 టైటిల్ సొంతం చేసుకున్నాడు.