Victory Venkatesh

Victory Venkatesh Birthday: ముచ్చటైన సినిమాల ఉత్తమ నటుడు విక్టరీ వెంకటేష్!

Victory Venkatesh Birthday: విక్టరీ వెంకటేశ్ సినిమా అంటే పండగలా ఉంటుంది. ఓ పెద్ద ఫ్యామిలీని థియేటర్ లో కలిసినట్టు ఉంటుంది. అందువల్లే ఆయన ఫ్యామిలీ స్టార్ అయ్యారు. విక్టరీ వెంకటేశ్ అయ్యారు. డిసెంబర్ 13న వెంకటేశ్ పుట్టినరోజు… ఈ సందర్భంగా వెంకటేశ్ కు విషెస్ చెబుతూ, ఆయన మూవీ కెరీర్ పై ఓ లుక్కేద్దాం 

మూడున్నర దశాబ్దాల నుంచీ వెంకటేశ్ తనదైన బాణీ పలికిస్తూ జనాన్ని పులకింప చేస్తున్నారు… నవతరం ప్రేక్షకులను సైతం అలరిస్తూ సాగుతున్నారు!… వయసుకు తగ్గ పాత్రల్లో ఆకట్టుకుంటూ వచ్చే పండక్కు ఆయన రాబోతున్నారు. చిత్రం ఏమంటే… ఆ సినిమా పేరు కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’. నటుడిగా ఆయనకు ఇది 76వ సినిమా!

ఇది కూడా చదవండి: World Chess Championship 2024: ప్రపంచ చెస్ ఛాంపియన్‌ షిప్ లో గ్రాండ్ మాస్టర్ గుకేశ్ సంచలనం..

Victory Venkatesh Birthday: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతల కొడుకులకు నటనపై ఆసక్తి కలిగించిన క్రెడిట్ వెంకటేశ్ కే దక్కుతుంది.  విక్టరీని ఇంటి పేరుగా ఆయన మార్చుకో బట్టే… ఆ తర్వాత  చాలామంది నిర్మాతలు తమ పిల్లలను హీరోలుగా పరిచయం చేయడానికి ధైర్యంచేశారు.

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఎవరికీ సాధ్యం కాని, అరుదైన రికార్డును నటునిగా వెంకటేశ్ సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఎక్కువ సార్లు ‘ఉత్తమనటుని’గా నంది అవార్డును అందుకున్న ఏకైక హీరో ఆయనే.  ఏకంగా ఐదు సార్లు ఉత్తమ నటునిగా ‘నంది’ని సొంతం చేసుకున్నారు వెంకటేశ్!

ఇది కూడా చదవండి: Keerthy Suresh: కీర్తి సురేశ్ పెళ్ళైపోయింది!

Victory Venkatesh Birthday: టాలీవుడ్ లో వివాదరహితంగా ఉన్న నటుల పేర్లు చెప్పమంటే ఠక్కున గుర్తువచ్చే మొదటి పేరు వెంకటేష్. ఎటువంటి పాత్ర అయినా.. మల్టీస్టారర్ సినిమాలు చేయాలి అన్నా.. ఆ సినిమాల్లో తన పాత్ర చిన్నదిగా కనిపిస్తుంది అనుకున్నా సరే.. ఈగోలకు పోకుండా ముందుకు వచ్చి చేసే ఏకైక హీరో వెంకటేష్. అందుకే ప్రస్తుతం ఆయన చేసినన్ని మల్టీస్టారర్స్ ఎవరూ చేయలేదు. పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల చేసినా.. వరుణ్ తేజ్ తో F2 వంటి ఫన్ ఫిల్డ్ మూవీ చేసినా అది వెంకటేష్ కి మాత్రమే సాధ్యం.

 సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్… యంగ్ హీరోస్ తో కలసి చిందేస్తున్నారు… తన వయసుకు తగ్గ పాత్రల్లో మురిపిస్తున్నారు… ఎటు చూసినా వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు… ఆయన మరిన్ని చిత్రాలతో జనాన్ని అలరించాలని ఆశిద్దాం… వన్స్ ఎగైన్ హ్యాపీ బర్త్ డే టు వెంకటేశ్ 

ALSO READ  Vaarasatwam: 60 ఏళ్ల 'వారసత్వం'!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *