Lucknow: కోతి అని పిలిచినా భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

Lucknow: పేదలు ఎప్పుడూ ఒక విషయం చెప్పేవారు.. మాట మంచిదైతే ఊరు మొత్తం బంధువులే అని. ఒక చిన్న మాటకే (అది కూడా బూతు కాదు) భర్తపైన అలిగిన భార్య, గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.

లక్నో ఇందిరానగర్‌లో భర్త రాహుల్, భార్య శ్రీవాస్తవ నివసించేవారు. వీళ్లిద్దరు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫ్యామిలీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతాపూర్ నుండి బుధవారం అందరూ ఇంటికి తిరిగి వచ్చారు. తర్వాత హాల్‌లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ అందరూ ఆనందంగా ఉన్నారు. అదే సమయంలో శ్రీవాస్తవ భర్త ఆమెను ‘బందరియా’ (కోతి) అని పిలిచాడు. అది విన్న వెంటనే ఆమె కోపంతో తన గదిలోకి వెళ్లిపోయింది. అందరూ సాధారణంగానే వెళ్లిపోయింది అనుకున్నారు.

ఇది కూడా చదవండి: Viral News: పనిలో లేదు తప్పు.. చూసే చూపులోనే లోపం! పిజ్జా డెలివరీ బాయ్‌ని ఎగతాళి చేసిన స్నేహితురాలు.

కొంతసేపటి తర్వాత భోజనానికి పిలవడానికి తన గదికి వెళ్తే డోర్ లాక్ వేసి ఉంది. ఎంత పిలిచినా సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త కిటికీలోంచి చూడగా.. సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న శ్రీవాస్తవ కనిపించింది. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కు తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం తర్వాత ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా ఈ విషయంపైన పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు.

శ్రీవాస్తవ అక్క అంజలి తన చెల్లి గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. తన సోదరికి మోడలింగ్ అంటే ఇష్టమని, తనని ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకోలేదని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *