Monsoon Parliament Session

Parliament Winter Session: ఈరోజు నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు

Parliament Winter Session: 18వ లోక్‌సభ మూడో సెషన్ అంటే శీతాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఆదివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమయంలో 30 పార్టీలకు చెందిన 42 మంది నేతలు హాజరయ్యారు. లోక్‌సభలో తొలిరోజే అదానీ కేసుపై చర్చ జరగాలని కాంగ్రెస్ సహా విపక్ష నేతలు డిమాండ్ చేశారు.

సౌరశక్తి కాంట్రాక్టుల కోసం గౌతమ్ అదానీ భారత అధికారులకు సుమారు రూ.2,200 కోట్ల లంచం ఇచ్చారని అమెరికా న్యూయార్క్ ఫెడరల్ కోర్టు ఆరోపించింది. ఈ విషయంపై రాహుల్ గాంధీ జేపీసీని డిమాండ్ చేశారు.

మణిపూర్ హింస, కాలుష్యం, రైలు ప్రమాదాలపై పార్లమెంటులో చర్చకు కూడా తమ పార్టీ ప్రతిపాదించిందని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ తెలిపారు. అయితే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ – చర్చలో ఉన్న అంశాలపై వ్యాపార సలహా కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. విపక్షాలు సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. 

ఇది కూడా చదవండి: Maharashtra: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి కూటమి సిద్ధం

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ సమయంలో 19 సమావేశాలు జరుగుతాయి. పార్లమెంటు ఆమోదం కోసం వక్ఫ్ సవరణ బిల్లుతో సహా 16 బిల్లులతో కూడిన జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. లోక్‌సభ బులెటిన్‌ ప్రకారం లోక్‌సభలో 8, రాజ్యసభలో 2 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

సమావేశాల ప్రారంభానికి ముందు, వాయనాడ్, నాందేడ్ స్థానాల నుండి ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు కొత్త ఎంపీలతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రమాణం చేయిస్తారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *