Ranganath: నా ఇల్లు అక్కడ లేదు..క్లారిటీ ఇచ్చిన రంగనాథ్..

Ranganath: సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై స్పందించారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్.తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. మధురానగర్‌లో 44 ఏళ్ల క్రితం మా తండ్రిగారైన ఏపీవీ సుబ్బయ్య నిర్మించారని, ఆ ఇంట్లోనే తాము ఉంటున్నామని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్క్‌గా మార్చారన్నారు.

కృష్ణకాంత్ పార్క్‌కు మా ఇంటికి మధ్య వేలాది ఇళ్లు ఉన్నాయన్నారు. చెరువు కట్ట దిగువన పది మీటర్లు దాటితే బఫర్ జోన్ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. సంస్కృతి, సంప్రదాయాలలో భాగంగా చెరువు కట్ట మీద కట్టను ఆనుకుని కట్ట మైసమ్మ ఆలయాలు నిర్మిస్తారనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. తాము నివాసం ఉంటున్న ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో కట్ట మైసమ్మ గుడి ఉందన్నారు. తమ ఇల్లు చెరువు కట్టకు దాదాపు కిలోమీటరు దూరంలో ఉందని పేర్కొన్నారు. తాము ఉంటున్న ఇల్లు బఫర్ జోన్ లో లేదు అనేది వాస్తవమని అందరూ గ్రహించాలని కోరారు. అంతే కాకుండా ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా పరిశీలించాలని కోరుతూ ఫొటోలు కూడా రంగనాథ్ విడుదల చేశారు.

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rain alert: రెడ్ అలెర్ట్.. తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న ఫెంగల్‌ తుఫాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *