Mad Square OTT: టాలీవుడ్ నుంచి లేటెస్ట్ సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ గురించి తాజా అప్‌డేట్ వచ్చింది. యంగ్ హీరోలు నర్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సాలిడ్ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించారు. థియేటర్లలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, అదిరిపోయే వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
ఇప్పుడు థియేటర్ రన్‌ను దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ‘మ్యాడ్ స్క్వేర్’ ఈ ఏప్రిల్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో కాకుండా కేవలం తెలుగులోనే అందుబాటులో ఉంటుందని టాక్.
Also Read: Hit 3 Trailer Released: ‘హిట్ 3’ ట్రైలర్ వచ్చేసింది
Mad Square OTT: ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. మరోవైపు, ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.