Jagtial: జగిత్యాల రూరల్ తిప్పన్నపేట గ్రామంలో బండారి వెంకటరాజం తన ఎనిమిది గుంటల స్థలంలో చదును చేసుకున్న సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు వచ్చి విచక్షణ రహితంగా దాడి చేశారని వచ్చిన వారిలో ఒకరు ఒకటో వార్డు కౌన్సిలర్ కుసరి అనిల్ కాగా వారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరులమని తెలుపుతూ నాపై దాడి చేసి నువ్వు జీవన్ రెడ్డి మనిషివి అంటూ దూషించారు ఇదే విషయమై జగిత్యాల రూరల్ ఎస్సై కి కంప్లైంట్ చేయగా ఎస్సై తిరిగి నా పైనే కౌంటర్ ఫైల్ చేశాను అన్నాడు జగిత్యాల రూరల్ ఎస్సై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని రూరల్ పోలీస్ స్టేషన్ కు సంబంధించి ఎస్సై పై ఇప్పటికే పలు అభియోగాలు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు దారులపై దురుసుగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వెంటనే ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని నా స్థలం కబ్జా చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని నా వద్ద ఉన్న డాక్యుమెంట్ చూసి న్యాయం చేయగలరని కోరారు.
