Weather: ఉపరితల ఆవర్తనం ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో వాయుగుండగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది.దీని ప్రభావంతో నేడు, రేపు ఏపీ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అంచనాలకు మించిన వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉండొచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఈ అల్పపీడనం వల్ల నేడు శ్రీకాకుళం, విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిస్తాయి. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు.శని, ఆదివారాల్లో తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంపైకి చేపల వేటకు వెళ్లకూడదని ఐఎండీ సూచించింది.