AP News

AP News: విశాఖ కేర్ ఆస్పత్రిలో దారుణం

AP News: వీడు ఎవడో కానీ. చాలా పెద్ద ముదురు గాడు. స్కాన్ చెయ్ అంటే…బట్టలు విప్పించి..భూతు పని చేయబోయాడు. ఇదేంటి తలకు గాయం అయితే, బాడీపై బట్టలు విప్పడం ఏంటి అని అనుమానం వచ్చిన ఆమె ..నిలదీసింది. నాకంటే నీకు ఎక్కువ తెలుసా అని అన్నాడు. నీకంటే ఎక్కువ తెలుసో లేదో..చూపిస్తా అని ..నిలదీసింది. కతం…వాడికంటే ఎక్కువ తెలిసిన పోలీసులు అక్కడికి వచ్చి …చలో ..చలో అని తీసుకెళ్లారు.

విశాఖ జిల్లాలోని కేర్ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. స్కానింగ్ కోసం వచ్చిన మహిళకు లైంగిక వేధింపులు జరిగాయి. తలకు గాయం అయితే బట్టలిప్పించారు స్కానింగ్ సెంటర్ సిబ్బంబది. . స్కానింగ్ చేయాలంటూ మహిళపై అసభ్య ప్రవర్తనంగా వ్యవహారించారు. స్కానింగ్ సెంటర్ ఇన్‌ఛార్జ్ ప్రకాష్‌ లైంగికంగా దాడికి పాల్పడ్డాడు.

AP News: అయితే, వెంటనే మహిళ పెద్దగా కేకలు పెట్టడంతో స్కానింగ్ సెంటర్ ఇన్‌చార్జ్ ప్రకాష్ విషయం వెలుగులోకి వచ్చింది.. వెంటనే అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు ప్రకాష్‌కి దేహశుద్ధి చేశారు. అయితే, ఈ వ్యవహారాన్ని గోప్యంగా కేర్ ఆస్పత్రి యాజమాన్యం ఉంచినట్లు తెలుస్తోంది.

కేర్ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.. విషయం తెలుసుకున్న పోలీసులు కామాంధుడు ప్రకాష్‌ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.. అయితే, గతంలోనూ కూడా కేర్ ఆస్పత్రిపై అనేక విమర్శలు వచ్చాయి..కేర్ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో పేషెంట్లు నరకం చూస్తున్నారని విమర్శలు కూడా వచ్చాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana: తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పొలిటికల్‌ రచ్చ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *