Ranji Trophy: గౌతమ్ గంభీర్ భారత జట్టుకి కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి టీమిండియా ఎవరూ అనుకోని రీతిలో పేలవ ప్రదర్శనను కనబరిచింది. వరుసగా శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల చేతిలో వరుసగా టెస్టు సిరీస్ లను కోల్పోయింది. టి-ట్వంటీ లలో బాగా రాణించినప్పటికీ మిగిలిన రెండు ఫార్మాట్లలో మాత్రం విఫలమైంది. అయితే తాజాగా ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత గంభీర్ భారత ప్లేయర్లందరూ దేశవాళీ టోర్నమెంట్లలో ఆడాల్సిందే అని తేల్చి చెప్పాడు.
స్టార్ ప్లేయర్స్ రంజీలలో పాల్గొనడం గురించి గౌతమ్ గంభీర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటినుండి పెద్ద చర్చ జరిగింది. కానీ సీనియర్ ప్లేయర్లు తమకున్న షెడ్యూల్ అనుగుణంగా వీటిల్లో పాల్గొనడం కష్టమే అని భావించారు. అయితే తాజాగా బయటకు వచ్చిన వార్తలు ప్రకారం టీమిండియా స్టార్ ప్లేయర్లు అందరూ రంజీల్లో పాల్గొనేందుకు తయారు అయ్యారు. మొదటగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దిల్లీ జట్టు తరఫున ఈ నెల 30వ తేదీన సౌరాష్టతో జరగనున్న రంజీ మ్యాచ్ లో ఆడనున్నాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత కోహ్లీ రంజీల్లో పాల్గొననుండడం గమనార్హం. ఇతనితో పాటు ఇండియన్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా దిల్లీ జట్టు తరఫున ఆడనున్నాడు. వీరు ఈ రంజీ మ్యాచ్ ల ద్వారా తమ ఆటను మెరుగుపరుచుకోవడానికి, అలాగే యువ ప్లేయర్లకు స్ఫూర్తిని నింపడానికి ఉపయోగపడతారు అని బోర్డు భావిస్తోంది.
ఇది కూడా చదవండి: IND vs ENG 1st T20: నేడే ఇంగ్లండ్తో తొలి T20.. కళ్లన్నీ షమీపైనే
వీరిద్దరితో పాటు మిగిలిన సీనియర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ కూడా తమ జట్లకు రంజీల్లో ఆడేందుకు సిద్ధమయ్యారు అని ఖచ్చితమైన వర్గాల నుండి వార్తలు బయటకు వచ్చాయి. బీసీసీఐ అల్టిమేటమ్ జారీ చేసిన తర్వాత ముంబై తరఫున రోహిత్ శర్మతో పాటు ఓపెనర్ బ్యాటర్ యశస్వి జైస్వాల్, అలాగే పంజాబ్ తరఫున శుభ్ మన్ గిల్ కూడా 23వ తేదీ నుండి మొదలు కాబోయే ఈ మెగా టోర్నమెంట్ లో పాల్గొననున్నారు. ఎంతో కీలక ఆటగాళ్ల ఫామ్ పడిపోయిన తర్వాత బీసీసీఐ ఈ అల్టిమేటమ్ జారీ చేయడంతో రాబోయే ఈ మ్యాచ్ లలో వీరు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ రంజీ టోర్నమెంట్ ముగిసిన తరువాత చాంపియన్స్ ట్రోఫీలో ఆడబోతున్న బ్యాటర్లు అందరూ ఆ తర్వాత ఐపీఎల్ ఆడుతారు. ఆ తరువాయి ఇంగ్లాండ్ తో కీలక టెస్ట్ సిరీస్ మొదలుకానుంది. ఇక బయటికి వస్తున్న వార్తలు ఏమిటంటే ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ సిరీస్ కంటే ముందు కౌంటీ లలో ఆడుతాడట. ఐపీఎల్ షెడ్యూలు కనుక వెసులుబాటులో ఉంటే అతను అందరికంటే ముందే ఇంగ్లాండు బయలుదేరి అక్కడ కౌంటిల్లో పాల్గొంటాడు. లేనిపక్షంలో నేరుగా టెస్ట్ సిరీస్ ఆడుతాడు. అయితే ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు భారత జట్టు జట్టు లోకల్ ప్లేయర్లతో కూడా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఏదేమైనా టెస్ట్ క్రికెట్లో మళ్లీ కీలక ప్లేయర్లు రాణించేందుకు ఈ రకమైన ప్రాక్టీస్ అత్యవసరమని కోచింగ్ స్టాఫ్, బోర్డు భావిస్తున్నారు. ఇది ఎంత మేరకు ప్లేయర్లకు ఉపయోగపడుతుంది అన్నది వేచి చూడాలి.