Viral baba: ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఒక బాబా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఆయనే గోల్డెన్ బాబా! కేరళకు చెందిన ఈ సాధువు ఇప్పుడు కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు.
ఒళ్లో ఆరు కిలోల బంగారమే!
ఈ గోల్డెన్ బాబా అంటే మహా మండలేశ్వర్ నారాయణానంద్ గిరి మహరాజ్. తన ఒంటిపై ఏకంగా ఆరు కిలోల బంగారు ఆభరణాలు ధరించి మేళాకు హాజరయ్యాడు. రుద్రాక్షలు, పగడాలు, రూబీలు, నీలమణులు, పచ్చలు… ఇలా నాణ్యత గల రత్నాలతో తయారైన ఈ నగలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
“నగల నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది”
గోల్డెన్ బాబా మాట్లాడుతూ, ఈ బంగారు నగలను గత 15 ఏళ్లుగా దేవతలకు గుర్తుగా ధరిస్తున్నానని చెప్పారు. ఈ నగల నుంచి తనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, శ్రీ యంత్రంతో కలిపి పూజల్లో వీటిని వినియోగిస్తున్నానని తెలిపారు.
కుంభమేళాలో హాట్ టాపిక్
గోల్డెన్ బాబా ఇప్పుడు మేళాలో హాట్ టాపిక్. భక్తులూ, సందర్శకులూ ఆయనతో సెల్ఫీలు తీయడంలో మునిగిపోయారు. “ఈ బంగారాల వెనుక నిజమేమిటో?” అని ఆరా తీస్తున్నారు. కుంభమేళాకు వెరైటీ బాబాలు అందమైన కలర్ చేస్తున్నా, గోల్డెన్ బాబా మాత్రం ఈసారి అందరి దృష్టిని తన వైపుకు తిప్పేశారు.