Vince Zampella:

Vince Zampella: కాల్ ఆఫ్ డ్యూటీ వీడియో గేమ్ కో క్రియేట‌ర్ అమెరికాలో దుర్మ‌ర‌ణం

Vince Zampella: ప్ర‌ముఖ వీడియో గేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ కో-క్రియేట‌ర్ విన్స్ జంపెల్లా (55) అమెరికాలోని కాలిఫోర్నియాలో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న ఫెరారీ కారు అతి వేగంతో రావ‌డంతో నియంత్ర‌ణ కోల్పోయి ఎదురుగా ఉన్న కొండ‌ను ఢీకొట్టింది. ఈ స‌మయంలో కారులో నుంచి మంట‌లు చెల‌రేగాయి. ఈ కారు ప్ర‌మాదంలో విన్స్‌తోపాటు మ‌రో వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

Vince Zampella: విన్స్ జంపెల్లా దుర్మ‌ర‌ణం వీడియో గేమింగ్ ప్ర‌పంచంలో విషాదాన్ని నింపింది. ఆయ‌న గేమింగ్ ప్ర‌పంచానికి అందించిన సేవ‌ల‌ను స్మ‌రించుకుంటూ గేమ‌ర్లు, సీఓడీ బృందం స‌భ్యులు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. ఆయ‌న మ‌ర‌ణానికి సంతాపం తెలిపారు. ఆయ‌న మ‌ర‌ణంపై గేమింగ్ ప్ర‌ముఖులు ఎంద‌రో విచారం వ్య‌క్తంచేశారు.

Vince Zampella: విన్స్ జంపెల్లా కాల్ ఆఫ్ డ్యూటీతో పాటు రెస్పాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనే సంస్థ‌ను స్థాపించాడు. అదే విధంగా అపెక్స్ లెజెండ్స్‌, టైటాన్ ఫుల్‌, స్టార్ వార్స్ జెడీ సిరీస్‌ల‌ను రూపొందించ‌డంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *