Nara Lokesh

Nara Lokesh: తీపికబురు చెప్పిన లోకేష్.. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి మండపాలు పెట్టే వాళ్ళకి మంత్రి నారా లోకేష్ మంచి శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గణేష్ మండపాలకు కరెంట్ ఫ్రీగా (ఉచిత విద్యుత్) ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పండుగను ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఫుల్ ఖుషీ అవుతూ థ్యాంక్స్ చెబుతున్నారు. మరోవైపు, పర్మిషన్ల కోసం ఆఫీసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ప్రభుత్వం ఈసారి సింగిల్ విండో పోర్టల్ తెచ్చింది.

పర్మిషన్లు ఎలా తీసుకోవాలి?
  • ఆన్‌లైన్‌లో www.ganeshutsav.net అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈజీగా అప్లై చేసుకోవచ్చు.
  • దీని కోసం ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టక్కర్లేదు, ప్రాసెస్ మొత్తం పూర్తిగా ఫ్రీ.
  • వివరాలన్నీ చెక్ చేశాక పోలీసులు ఒక క్యూఆర్ కోడ్ (QR Code) ఇస్తారు. దాన్ని ప్రింట్ తీసి మండపం దగ్గర అందరికీ కనిపించేలా అతికించాలి.
  • మండపం పెట్టడానికి కనీసం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ ఉండాలి. సొంత జాగాల్లో పెడితే ఓనర్ పర్మిషన్, ప్రభుత్వ స్థలాల్లో అయితే పంచాయతీ లేదా మున్సిపాలిటీ పర్మిషన్ లెటర్ జత చేయాలి.
పోలీసులు చెప్పిన ముఖ్యమైన రూల్స్..
  • కరెంట్ & ఫైర్ సేఫ్టీ: వైరింగ్ సరిగ్గా చూసుకోవాలి, షార్ట్ సర్క్యూట్లు, అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పడాలి. విగ్రహం ఎత్తు ఎంత, ఎన్ని రోజులు ఉంచుతారు, నిమజ్జనం ఎప్పుడు చేస్తారనేది ముందే చెప్పాలి.
  • నైట్ కాపలా: రాత్రి పూట మండపం దగ్గర కమిటీ వాళ్ళు ఎవరో ఒకరు కచ్చితంగా కాపలా ఉండాలి. రోడ్ల మీద ట్రాఫిక్‌కి అడ్డం రాకుండా చూసుకోవాలి.
  • స్పీకర్ల టైమింగ్స్: చెవులు చిల్లులు పడేలా పెద్ద పెద్ద సౌండ్లు పెట్టకూడదు. మైకులు కేవలం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వాడాలి.
నిమజ్జనం & ఊరేగింపు..

నిమర్జనం ఊరేగింపుల్లో అసభ్యకరమైన డ్యాన్సులు, గొడవలు పడకుండా గణేష్ మండపం లోని కమిటీ సభ్యులు చూసుకోవాలి.  తాగి వచ్చి రచ్చ చేసేవాళ్ళని ఊరేగింపుల్లోకి రానివ్వకూడదు, ఏమైనా జరిగితే నిర్వాహకులదే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్ లేకుండా విపరీతమైన సౌండ్ ఇచ్చే డీజేలు పెట్టడం, డేంజరస్ టపాసులు కాల్చడం చేయకూడదు. విగ్రహాన్ని తీసుకెళ్లే బండి కండిషన్‌లో ఉందో లేదో చూసుకోవాలి, డ్రైవర్‌కి లైసెన్స్ కచ్చితంగా ఉండాలి. రద్దీలో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి.

lokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *