Vijay Deverakonda Rashmika: విజయ్ దేవరకొండ, రశ్మిక పెళ్ళి ఇక లాంఛనమేనా… అంటే నిజమే అని స్పష్టం అయింది. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకూ ఎవరూ బయటపడలేదు. పలుమార్లు వీరిద్దరూ కలసి రెస్టారెంట్స్ లోనూ విదేశీ విహారాల్లోనూ పాపరాజీ కంటి పడినా వారి మధ్య అనుబంధాన్ని మాత్రం ధ్రువీకరించలేదు. ఇటీవల మరోసారి రెస్టారెంట్ లో కలసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్అవుతోంది. అంతే కాదు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా వీరు ఓపెన్ అవుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తాను సింగిల్ కాదని, ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నానని స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే చెన్నైలో ‘పుష్ప2’ ఈవెంట్ లో రశ్మిక రిలేషన్ షిప్ స్టేటస్ పై ఓపెన్ అయింది. మీరు పెళ్ళాడేది ఇండస్ట్రీ వ్యక్తినా? లేక బయటి వ్యక్తినా? అన్న యాంకర్ ప్రశ్నకు ‘అది అందరికీ తెలిసన విషయమే’ అంటూ కుండ బద్దలు కొట్టేసింది రశ్మిక.
Vijay Deverakonda Rashmika: రశ్మిక ఆన్సర్ కు స్టేడియంలో ఉన్న వీక్షకులతో పాటు అల్లు అర్జున్, శ్రీలీల కూడా చప్పట్లు కొట్టేశారు. యాంకర్ హింట్ ఇవ్వండని డిగ్ చేయబోగా పర్శనల్ గా చెబుతా అంటూ దాటవేసింది రశ్మిక. అటు రెస్టారెంట్ పిక్ లీక్ అయిన కొద్ది గంటల్లోనే రశ్మిక కూడా ఇన్ డైరెక్ట్ గా చెప్పటంతో త్వరలోనే విజయ్ దేవరకొండ-రశ్మిక పెళ్ళి బాజాలు మోగటం ఖాయం అని అంటున్నారు. ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాలలో రీల్ జోడీగా నటించిన వీరిద్దరూ రియల్ జోడీగా మారబోతున్నారన్న మాట. మరి వీరిద్దరూ తమ పెళ్ళి విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.