Vijay Devarakonda: విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ ను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే నాయికగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నిజానికి దీనిని మార్చి 28న విడుదల చేయాలని తొలుత మేకర్స్ భావించారు. అయితే… ఇంకా షూటింగ్ బాలెన్స్ ఉండటంతో దీనిని మే 30వ తేదీకి వాయిదా వేసే ఆలోచన చేస్తున్నారు. అందుకే ఇదే సంస్థకు చెందిన మ్యాడ్ స్క్వేర్`ను మార్చి 29న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అలానే దానికి ఒకరజు ముందు నితిన్ `రాబిన్ హుడ్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సైతం మార్చి 28న రావాల్సి ఉంది. అది వాయిదా పడటం వల్లే ఈ రెండు సినిమాలు జనం ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మే నెలాఖరుకు రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. విజయ్ దేవరకొండ తాజా చిత్రం ` ఫ్యామిలీ స్టార్` పరాజయం అయిన నేపథ్యంలో… గౌతమ్ తిన్ననూరి సినిమా మీదే అతని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.