Disha Patani: బాలీవుడ్ భామ దిశా పటాని కెరీర్ తెలుగు సినిమా లోఫర్`తో మొదలైంది. ఆ తర్వాతే ఆమె నటించిన హిందీ సినిమా `ఎమ్మెస్ ధోని విడుదలైంది. భాషా భేదం లేకుండా అనేక చిత్రాలలో దిశాపటానీ నటించింది. గత యేడాది తెలుగు సినిమా కల్కి 2898 ఎ.డి.`తో పాటు, హిందీ చిత్రం `యోథ`లో నటించింది. అలానే సూర్య మూవీ `కంగువా`తో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హిందీలో `వెల్ కమ్ టు ది జంగిల్ మూవీలో నటిస్తోంది. అలానే అమ్మడు ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్ట్స్ పై దృష్టిపెట్టింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫేమ్ టైరీస్ గిబ్సన్ నటించిన ఓ వెబ్ సీరిస్ లో అతనితో దిశాపటాని జోడి కట్టబోతోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ వెబ్ సీరిస్ సెట్స్ పై నుండి కొన్ని ఫోటోలను దిశా పటాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మెక్సికోలో దీని షూటింగ్ జరుగుతోంది. మరి తొలి హాలీవుడ్ ప్రాజెక్ట్ తో దిశా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూద్దాం.
