Gully boy sequel: రణ్‌వీర్ సింగ్ తో జోయా ఆక్తర్ దర్శకత్వంలో పర్హాన్ ఆక్తర్ నిర్మించిన ‘గల్లీబాయ్’ సినిమా ఆరేళ్ళ క్రింత రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ కల్ట్ క్లాసిక్ కి సీక్వెల్ ప్రకటించారు. ఈ సీక్వెల్ లో విక్కీకౌశల్, అనన్య పాండే ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ఈ ‘గల్లీబాయ్’ యూనివర్శ్ ను ‘ఖో గయే హమ్ కహాన్’ డైరెక్టర్ అర్జున్ వరైన్ సింగ్ డైరెక్ట్ చేయబోతున్నారు. ముంబై గల్లీలలో నివసించే యువత లైఫ్ ను ఆవిష్కరించిన తొలి భాగం ఇతివృత్తాన్ని కొనసాగిస్తూ కొత్త తరహాలో ఆవిష్కరించబోతున్నామని యూనిట్ చెబుతోంది. కొత్త తారాగణంతో తీయబోయే ఈ ఫ్రాంచైజ్ ముంబై గల్లీబాయ్స్ జీనవశైలిని కొత్తగా చూపిస్తామంటున్నారు. ఈ ఏడాది రాబోయే మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ‘గల్లీబాయ్’ సీక్వెల్ కూడా ఒకటని అంటున్నారు. మరి రణ్ వీర్ సింగ్ లాగే విక్కీ కౌశల్ కూడా ‘గల్లీబాయ్’గా ఆకట్టుకుంటాడేమో చూడాలి.