Veteran Athlete: చాలామంది చెబుతారు మనసు ఉల్లాసంగా ఉంటే.. వయసు పెద్ద విషయం కాదని. అలాగే ఏదైనా సాధించడానికి వయసు అడ్డంకి కాదు. ఒక ఘనత సాధించాలనుకునే వారు ఆరేళ్ల వయసులో అయినా సాధిస్తారు. 60 ఏళ్ల వయస్సులో వారు సాధిస్తారు. కావలసింది సంకల్పం. టార్గెట్ కోసం కష్టపడటం.. చివరివరకు ప్రయత్నించడం అంతే.
అందుకు ఉదాహరణ ఈ 56 ఏళ్ల ఉపాధ్యాయుడు. ఈయన రన్నింగ్‌లో ఏకంగా నాలుగు పతకాలు సాధించి సంచలనం సృష్టించారు. మంగళూరులో 10 నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు కోస్తా జిల్లా పాఠశాలల ఉపాధ్యాయులకు పరుగు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 40 ఏళ్లలోపు ఉపాధ్యాయులే ఎక్కువ మంది పాల్గొన్నారు. అయితే ఈ రేసులో భాస్కర్ నాయక్ అనే 56 ఏళ్ల ఉపాధ్యాయుడు కూడా చేరాడు.
Veteran Athlete: ఇంత పెద్ద వయసు వ్యక్తి. ఏమి చేస్తాడు. పైగా పరుగు పందెం అంటే మాటలు కాదు.. ఈ రేసులు ఎలా గెలుద్దామని పోటీలకు వచ్చేశారు అంటూ అక్కడకు వచ్చిన వారంతా అనుకున్నారు. కానీ, ఆయన తనకంటే 20 ఏళ్ళు చిన్నవారైన యువ ఉపాధ్యాయులను సవాలు చేస్తూ పతకాలను సొంతం చేసుకున్నారు. ఈయన 1,500, 800 మీటర్ల రేసుల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. 400 మీటర్ల రేసులో రజతం, కాంస్య పతకాలు సాధించాడు. ఈ ఘనత చూసి ఉపాధ్యాయులందరూ ఆశ్చర్యపోయారు. 1500 మీటర్ల పరుగు పందెం అంటే ఎంతో స్టామినా కావాలి. ఆ వయసులో కూడా ఆయన ఫిట్ నెస్ చూస్తే చిన్న వయసులోనే అడుగు తీసి అడుగేయడానికి ఆయాసపడిపోయే యువత నేర్చుకోవాల్సింది చాలా ఉందని అందరూ అనుకున్నారు.
Veteran Athlete: తన సక్సెస్ గురించి భాస్కర్ నాయక్ మాట్లాడుతూ నా వయస్సు 56 ఏళ్లు అయినప్పటికీ, నా శరీరాన్ని ఆకృతిలో ఉంచుకోవడంపై నేను చాలా దృష్టి సారిస్తాను. నేను ప్రతి ఉదయం వాకింగ్ – జాగింగ్ చేస్తాను. రన్నింగ్ ఈవెంట్‌లో రెండు స్వర్ణాలు సహా 4 పతకాలు సాధించడం ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా వీలైనన్ని పోటీల్లో పాల్గొంటాను. నేను చేయగలిగినంత వరకు పరిగెడుతూనే ఉంటాను. విజయం సాధించడానికి వయసు అడ్డంకి కాదని నా గట్టి నమ్మకం.” అని చెప్పారు.
