Crime News: బళ్లారి సమీపంలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయిన యువకుడిని విచారణ నిమిత్తం సంఘటనా స్థలానికి తీసుకెళ్లగా పోలీసుల పై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వారు అతనిని కాల్చివేశారు. బళ్లారి తోరణకల్‌లో నివాసముంటున్న ఓ దంపతుల ఐదేళ్ల కుమార్తె 13వ తేదీ రాత్రి దుకాణానికి వెళ్లి ఇంటికి వస్తుండగా ఓ యువకుడు ఆమెను ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేరగా, ప్రస్తుతం కోలుకుంటోంది.
Crime News: నిఘా కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా విజయనగరం జిల్లా కమలాపూర్‌కు చెందిన మంజునాథ్ (25) అనే యువకుడిని తోరణకల్ పోలీసులు బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు గాను గత రాత్రి కొప్పల్‌లో అరెస్టు చేశారు. పోలీసులు నిన్న తెల్లవారుజామున 4:00 గంటలకు మంజునాథ్‌ను సంఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. ఆ సమయంలో ఎస్ ఐ రఘుపతిపై దాడి చేసి విదిలించుకుని మంజునాథ్ పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో షాక్‌కు గురైన ఎస్‌ఐ ఆకాశంలో ఒక రౌండ్ కాల్పులు జరిపి లొంగిపోవాల్సిందిగా దాగేష్‌ను హెచ్చరించాడు. కానీ మంజునాథ్ వినలేదు. దీంతో అతని కుడి కాలుపై ఎస్ ఐ రఘుపతి కాల్చాడు. కుప్పకూలిపోయిన మంజునాధ్, గాయపడిన ఎస్ ఐ రఘుపతి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మంజునాధ్ మరణించాడు. ఎస్ ఐ రఘునాధ్ చికిత్స పొందుతున్నారు.
