Vemula Veeresham

Vemula Veeresham: ‘బతుకు మీద ఆశ లేదా?’ అని కేటీఆర్‌ బెదిరించారు

Vemula Veeresham: బతుకు మీద ఆశ లేదా?’ అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ తనను బెదిరించారని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌తో కలిసి వీరేశం  సీఎల్పీ మీడియా హాల్ లో మాట్లాడుతూ. గతం లో కేటీఆర్ తనను బెదిరించారు అని పార్టీ మారొద్దు అని అప్పటి స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) చీఫ్‌ ప్రభాకర్‌రావు సైతం టేబుల్‌పై తుపాకీ పెట్టి తనను బెదిరించినట్లు చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: ED: ఈడీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచార‌ణ

Vemula Veeresham: ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ పాత్ర కూడా వుంది అని. ఫోన్ ట్యాపింగ్ చేయించి తనను ఓడించాలి అని చూశారు కానీ నా గెలుపుని ఆపలేకపోయారు అని చెప్పారు. వికారాబాద్ లగచర్ల ఘటనలోనూ కేటీఆర్ వున్నాడు అని బయటికివచ్చింది. ప్రభుత్వం తొందరగా ఆయనని అరెస్ట్ చేయాలి అని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగితే సీఎం రేవంత్‌రెడ్డికి మంచిపేరు వస్తుందని పట్నం నరేందర్‌రెడ్డి ద్వారా లగచర్ల ఘటనలో అధికారులపై దాడి చేయించి ప్రభుత్వం నికి చెడపేరు తేవాలి అని కేటీఆర్‌ కుట్ర చేశారు’ అని వీరేశం ఆరోపించారు.లగచర్ల ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులందరినీ శిక్షించాలన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *