Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’ గత యేడాది విడుదలైంది. నటుడిగా విక్రమ్ లోని పొటన్షియాలిటీని ‘తంగలాన్’ సినిమా చూపించింది. ఇప్పుడు దానికి పూర్తి భిన్నమైన పాత్రను విక్రమ్ ‘వీర ధీర శూరన్- 2’లో చేశారు. ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరముడు, దుషార విజయన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను ఎస్.యు. అరుణ్ కుమార్ తెరకెక్కించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని నిర్మాత రియా శిబు తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు జరుపుకుంటున్న ‘వీర ధీర శూరన్ -2’ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మార్చి 27న విడుదల చేస్తామని తెలిపారు. తెలుగులో ఎన్వీఆర్ సినిమాస్ ద్వారా ఇది విడుదల కాబోతోంది.
