Unstoppable

Unstoppable: అన్ స్టాపబుల్ లో వెంకీ ఎమోషనల్ మూమెంట్స్!

Unstoppable: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 ప్రస్తుతం టెలీకాస్ట్ అవుతోంది. డిసెంబర్ 27న ఇందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ టీమ్ పాల్గొనబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ఈ ఎపిసోడ్స్ కు సంబంధించిన ఫోటోలను, ప్రోమోను మీడియాలో విడుదల చేసింది ఆహా సంస్థ. విశేషం ఏమంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కథానాయకుడు వెంకటేశ్‌, బాలకృష్ణ మధ్య అనుబంధం ఈనాటిది కాదు. అందుకే వాళ్ళు మద్రాస్ రోజుల్ని సైతం ఈ షోలో తలుచుకున్నారు.

ఇది కూడా చదవండి: Indians: భారతీయ పౌరులు పాక్ జైళ్లలో ఖైదు

Unstoppable: అలానే వెంకటేశ్ అన్నయ్య, ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు సైతం ఈ షోకు హాజరై తన అభిప్రాయాలను తెలిపాడు. ఈ అన్నదమ్ములిద్దరూ తమ తమ తండ్రి, మూవీ మొఘల్ డి. రామానాయుడుకు సంబంధించిన వివరాలను అడిగేసరికీ విచలితులయ్యారు. మాట రాక తడబడ్డారు. అయితే… చివరగా ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిని, హీరోయిన్స్ ను రప్పించి, బాలకృష్ణ రక్తికట్టించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Atlee Kumar: ఆ ఇద్దరు స్టార్స్ తో అట్లీ మూవీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *