Udvegam: మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో జి. శంకర్, ఎల్. మధు నిర్మించిన సినిమా ‘ఉద్వేగం’. త్రిగుణ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో దీప్సిక హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ భరత్, సురేశ్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శివకృష్ణ, అంజలి ఇందులో ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ నెల 22న విడుదల కావాల్సిన ‘ఉద్వేగం’ చిత్రాన్ని 29కి వాయిదా వేసినట్టు మేకర్స్ తెలిపారు. 2021లో వచ్చిన పవన్ కళ్యాణ్ కోర్ట్ డ్రామా ‘వకీల్ సాబ్’ తరహాలోనే ఇదీ ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు మహిపాల్ చెప్పాడు. ఇది హీరో త్రిగుణ్ కు 25వ చిత్రం!
ఇది కూడా చదవండి: Nayanthara: తెగేవరకూ లాగాలని చూస్తున్న నయన్

