Swetha Suicide: హైదరాబాద్ జవహర్‌నగర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. దాదాపు 18 ఏళ్లుగా పలు ప్రముఖ ఛానెళ్లలో యాంకర్‌గా పని చేసిన స్వేచ్ఛ, టెలివిజన్ రంగంలో మంచి గుర్తింపు పొందారు. ఆమె TUWJ (తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) సెక్రటరీగా కూడా సేవలు అందించారు.
వివాహ జీవితం, రెండో సంబంధం… ఆఖరికి విషాదం
స్వేచ్ఛకు ఇప్పటికే పెళ్లయి, ఒక కుమార్తె కూడా ఉన్నట్టు సమాచారం. కొంతకాలం క్రితం ఆమె తన మొదటి భర్తను విడాకులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అనంతరం టీ న్యూస్ మాజీ ఉద్యోగి పూర్ణచంద్రరావుతో కలిసి నివాసం ఉండడం ప్రారంభించారు. మొదటిగా ఆ బంధం స్నేహపూర్వకంగా సాగినప్పటికీ, కాలక్రమేణా విభేదాలు పెరిగినట్టు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: AP News: ఈ చిత్రం.. మానవతకు మాయని పత్రం
స్వేచ్ఛ పెళ్లి కావాలనే కోణంలో మాట్లాడుతుండగా, పూర్ణచంద్రరావు ఎప్పటికీ ఆలస్యం చేస్తూ ఉన్నాడని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కారణంగానే స్వేచ్ఛ తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు.
తల్లి ఆరోపణలు, పోలీసుల దర్యాప్తు
స్వేచ్ఛ తల్లి శ్రీదేవి మాట్లాడుతూ, “నా కుమార్తె పూర్ణచంద్రరావు మాయమాటలకి బలైంది. వాళ్ల మధ్య గత కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. మా అమ్మాయి ధైర్యంగా జీవితం సాగించేది. కానీ పెళ్లి విషయంలో నాశనం చేసింది,” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ నేపథ్యంలో, పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్ణచంద్రరావు ప్రస్తుతం గల్లంతయ్యారు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

