Trump Tariffs:

Trump Tariffs: భార‌త్‌కు మ‌రో బిగ్‌ షాక్.. 500 శాతం సుంకాల పెంపున‌కు ట్రంప్ నిర్ణ‌యం

Trump Tariffs: గ‌తేడాది 50 శాతం సుంకాల‌తో భార‌త‌దేశాన్ని ఇబ్బందుల పాలు చేయాల‌ని చూసిన అమెరికా దేశం.. మ‌రోసారి భార‌త్‌కు షాకిచ్చింది. ఈ సారి ఏకంగా 500 శాతం సుంకాల పెంపున‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ది. ర‌ష్యా దేశం నుంచి చ‌మురు ఉత్ప‌త్తుల కొనుగోళ్లు చేస్తున్నందుకే ఆదేశాధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సుంకాల నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మ‌రోసారి వెల్ల‌డైంది.

Trump Tariffs: ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో దానిని ఆపేందుకు ర‌ష్యా దేశంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ద్వైపాక్షిక ఆంక్ష‌ల బిల్లుకు ఆమోదం తెలిపిన‌ట్టు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ 500 శాతం సుంకాలు భార‌త‌దేశంతోపాటు ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోలు చేస్తున్న బ్రెజిల్‌, చైనా దేశాల ఉత్ప‌త్తుల‌పైనా విధించే అవ‌కాశం ఉన్న‌ది.

Trump Tariffs: తొలుత ఈ నిర్ణ‌యం ట్రంప్ తీసుకున్నార‌ని, దీనిపై వ‌చ్చే వారం కాంగ్రెస్‌లో ఓటింగ్ జ‌రుగుతుంద‌ని రిప‌బ్లిక‌న్ సెనేట‌ర్ లిన్సే గ్రాహం త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అధ్య‌క్షుడు ట్రంప్‌తో స‌మావేశ‌మైన తాను వివిధ అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు ఆ పోస్టులో లిన్సే గ్రాహం వెల్ల‌డించారు. ర‌ష్యాపై ఉన్న ఆంక్ష‌లు ఉల్లంఘించే దేశాల‌పై ఈ 500 శాతం సుంకాలు విధించే అవ‌కాశం ఉంటుంద‌ని హెచ్చ‌రించాఉ. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ యుద్ధం ఆపేందుకు సిద్ధ‌మేనంటూ.. అనేక మంది అమాయ‌కుల‌ను చంపుతున్నార‌ని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *