Toxic Censor Report

Toxic: టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

Toxic: రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’ (Toxic) సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి లైన్ క్లియర్ అయింది. నైజాం ప్రాంతంలో టికెట్ ధరలపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ, చిత్ర యూనిట్ విజ్ఞప్తి మేరకు టికెట్ ధరల పెంపుతో పాటు రోజుకు 5 షోల ప్రదర్శనకు అనుమతినిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో (GO) జారీ చేసింది.సినిమా థియేటర్లలోకి వచ్చే ముందు రోజే ఈ ఉత్తర్వులు వెలువడటంతో చిత్ర బృందంతో పాటు నైజాం డిస్ట్రిబ్యూటర్లు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం టికెట్ ధరల వివరాలు..
  • సింగిల్ స్క్రీన్లు: సాధారణ టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి రూ. 50 వరకు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
  • మల్టీప్లెక్స్‌లు & స్పెషల్ థియేటర్లు: ఒక్కో టికెట్‌పై గరిష్టంగా రూ. 100 వరకు అదనంగా వసూలు చేసుకోవచ్చు.
  • వర్తించే గడువు: పెంచిన ఈ ధరలు సినిమా విడుదలయ్యే మొదటి 10 రోజుల పాటు (ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 4 వరకు) మాత్రమే అమలులో ఉంటాయి.
  • రోజుకు 5 షోలు: రద్దీని దృష్టిలో ఉంచుకుని నిబంధనల ప్రకారం రోజుకు 5 రెగ్యులర్ షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చారు.

సినీ కార్మికుల సంక్షేమానికి రూ. 1 కోటి విరాళం..

టికెట్ ధరల పెంపుతో పాటు ప్రభుత్వం కొన్ని కీలక షరతులను విధించింది..
  1. కార్మికుల సంక్షేమ నిధి: సినిమా నిర్మాణ సంస్థ తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) ఆధ్వర్యంలోని ‘తెలుగు చిత్రపురి సినీ కార్మికుల సంక్షేమ కమిటీ’ ఖాతాకు రూ. 1 కోటి విరాళంగా జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మొత్తాన్ని సినీ పరిశ్రమలోని కార్మికుల శ్రేయస్సు కోసం వినియోగిస్తారు.
  2. సామాజిక చైతన్య ప్రకటనలు: థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు, విరామ సమయాల్లో డ్రగ్స్, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ప్రత్యేక ప్రకటనలను తప్పనిసరిగా ప్రదర్శించాలని థియేటర్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. టికెట్ రేట్లపై అధికారిక అనుమతులు రావడంతో నైజాం వ్యాప్తంగా బుకింగ్స్ ఊపందుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *