Coolie: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం టాలీవుడ్‌లో గట్టి పోటీ నడిచింది. పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగగా, బేరసారాలు హోరాహోరీగా సాగాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ రూ. 40 కోట్లకు ఆఫర్ చేయగా, ఏషియన్ సినిమాస్ సురేష్ బాబు, దిల్ రాజు కలిసి మరింత దూకుడుగా బిడ్ వేశారు.
Also Read: Trisha: ప్రేమలో త్రిష? సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్
Coolie: సన్ పిక్చర్స్ ఎవరు ఎక్కువ ధర ఆఫర్ చేస్తే వారికి హక్కులు ఇస్తామని స్పష్టం చేయడంతో ఉత్కంఠ రేగింది. అనేక రౌండ్ల చర్చల అనంతరం ఏషియన్ సినిమాస్ వారు రూ. 44 కోట్లతో పాటు జీఎస్టీ చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారని టాక్. దీంతో డబ్బింగ్ చిత్రాల్లో రికార్డు ధర పలికిన చిత్రంగా ‘కూలీ’ చరిత్ర సృష్టించింది. రూ. 100 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రజనీ ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.