Trisha: ప్రముఖ నటి త్రిష మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తమిళ సినీ పరిశ్రమలో ఓ స్టార్ హీరోతో త్రిష ప్రేమలో ఉన్నారనే ప్రచారం కలకలం రేపుతోంది. ఇటీవల త్రిష చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు, దానికి ఆమె తల్లి స్పందించిన తీరు – ఇవన్నీ కలిపి ఆమె వ్యక్తిగత జీవితంపై చర్చకు దారి తీశాయి.
ఒక ప్రముఖ హీరో పుట్టినరోజు సందర్భంగా, త్రిష అతనితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అదే ఫోటోను త్రిష తల్లి కూడా హార్ట్ ఎమోజీతో షేర్ చేయడంతో ఊహాగానాలకు ఇంకెందుకాలే! నెటిజన్లు వీరిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఉందంటూ జోరుగా వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే ఇది కేవలం స్నేహం మాత్రమేనని కొంతమంది భావిస్తుండగా, మరికొందరు మాత్రం ప్రేమ వ్యవహారమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రిషThough తాను ఏమీ స్పష్టంగా చెప్పకపోయినా, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “పూర్తిగా ప్రేమలో మునిగిపోతే, అది కొంతమందిని తికమక పెడుతుంది” అనే అర్థం వచ్చేలా ఓ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి మరింత ఊపు తెచ్చింది.
త్రిష పెళ్లి గురించి గతంలోనూ ఎన్నో వదంతులు వెలుగులోకి వచ్చాయి. కానీ ప్రతి సారి ఆమె స్పందిస్తూ, వాటిని ఖండిస్తూ, “తన దృష్టంతా సినిమాలపైనే ఉంది. వివాహం గురించి నిర్ణయం తీసుకుంటే, అందరికీ అధికారికంగా తెలియజేస్తాను” అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
కెరీర్ పరంగా చెప్పాలంటే, త్రిష సినిమాలలో అడుగుపెట్టి రెండుదశాబ్దాలు గడిచినా ఇప్పటికీ కథానాయికగా మంచి క్రేజ్ కలిగి ఉన్నారు. 2025లో ఇప్పటికే ‘ఐడెంటిటీ’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘విదాముయార్చి’ (తెలుగులో ‘పట్టుదల’) మరియు ‘థగ్‌లైఫ్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’, తమిళ స్టార్ సూర్యతో ‘కరుప్పు’ చిత్రాల్లో నటిస్తున్నారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న త్రిష, ఈ ప్రేమపుకార్లపై ఎలాంటి స్పందన ఇవ్వనున్నారో చూడాల్సి ఉంది.