Aneet Padda

Aneet Padda: అప్పుడు శ్రద్ధా కపూర్‌.. ఇప్పుడు అనీత్ పడ్డా.. షేకవుతున్న బీటౌన్!

Aneet Padda: బాలీవుడ్‌లో టాలెంట్, లక్ కలిస్తే స్టార్‌డమ్ ఖాయం! ‘సైయారా’ చిత్రం ఈ సమీకరణను నిరూపించింది. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ ఇప్పటికే 150 కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్తోంది. 200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ ఇద్దరూ కొత్తవారే. ముఖ్యంగా హీరోయిన్ అనీత్ పడ్డా, ‘సలామ్ వెంకీ’, ‘బిగ్ గర్ల్స్ డోంట్ క్రై’ సినిమాలు తప్ప గతంలో పెద్దగా అనుభవం లేకపోయినా, ‘సైయారా’తో ఒక్కసారిగా స్టార్‌గా మారింది. ఈ చిత్ర విజయంతో శ్రద్ధా కపూర్‌ను తలపిస్తూ బాలీవుడ్‌లో సంచలనంగా మారుతోంది. శ్రద్ధా కూడా ‘ఆషీకీ 2’తో స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. ఆసక్తికరంగా, ఈ రెండు చిత్రాలకు దర్శకుడు మోహిత్ సూరి. ఈ సెంటిమెంట్ అనీత్‌కు కలిసొస్తుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ‘ఆషీకీ 2’ తర్వాత శ్రద్ధా కెరీర్ ఊపందుకుంది. ఇప్పుడు అనీత్ కూడా అదే బాటలో శక్తివంతమైన నాయికగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *