Short News: హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం రేపుతోంది. ఈ నెల 14న రాత్రి సుధర్మ భవన్‌లో చోరీ జరిగినట్లు అధికారికంగా నిర్ధారణ అయ్యింది.మొదటి అంతస్తులోని ఓ రూమ్ నుంచి నాలుగు హార్డ్‌డిస్క్‌లు మాయమైనట్లు రాజ్‌భవన్ సిబ్బంది గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్‌లలో, హెల్మెట్ ధరించిన ఓ అనుమానితుడు కంప్యూటర్ రూమ్‌లోకి ప్రవేశించిన దృశ్యాలు కనిపించాయని సమాచారం.
ఈ హార్డ్‌డిస్క్‌లలో రాజ్‌భవన్‌కు సంబంధించిన కీలక ఫైల్స్, రిపోర్టులు, అధికార సంబంధిత సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్‌భవన్ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటనపై విచారణ కొనసాగుతోంది.సెక్యూరిటీ ఉన్న అత్యున్నత స్థలమైన రాజ్‌భవన్‌లో ఇలాంటి చోరీ జరగడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.