The Raja Saab: ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని దర్శకనిర్మాతలు ప్రకటించారు. అయితే విఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్తి కాలేదు. దీంతో ప్రకటించిన డేట్ కి సినిమా రిలీజ్ చేసే విషయంలో యూనిట్ లో గందరగోళం నెలకొని ఉంది. ‘రాజా సాబ్’ సినిమా వాయిదా ఖాయమని అందరూ నమ్ముతున్నారు. దీంతో వేసవి సీజన్ కు సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ‘రాజాసాబ్’ రిలీజ్ డేట్ పై పలువురు కన్నేశారు. మారుతితో ‘రాజా సాబ్’ నిర్మిస్తున్న పీపుల్స్ మీడియానే గోపీచంద్ మలినేనితో సన్నిడియోల్ దర్శకత్వంలో ‘జాట్’ సినిమా తీస్తోంది.
ఇది కూడా చదవండి: CP CV Anand: మహిళ చనిపోయింది అని చెప్పిన పట్టించుకోలేదు..సీపీ షాకింగ్ కామెంట్స్..
The Raja Saab: ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయటానకి ప్లాన్ చేస్తున్నారట. సిద్ధూ జొన్నలగడ్డతో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రూపొందిస్తున్న ‘జాక్’ సినిమాను కూడా ఏప్రిల్ 10వ తేదీనే ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇక క్రిస్మస్ కి రిలీజ్ కావలసిన నితిన్ ‘రాబిన్ హుడ్’ వాయిదా పడింది. అలాగే నితిన్ ‘తమ్ముడు’ కూడా రిలీజ్ కి రెడీ అయింది. ఈ రెండింటిలో ఒక దానిని ఫిబ్రవరి 25న రిలీజ్ చేసి మరో సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తారట. ‘రాజా సాబ్’ రిలీజ్ డేట్ పై క్లారిటీ రాగానే మిగిలిన సినిమాల విడుదల తేదీలు కూడా డిసైడ్ అవుతాయన్నమాట. చూద్దం ఏం జరుగుతుందో!