Sai Kumar: రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటించిన రాజా ది రాజా జూలై 17న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా థియేటర్లలో విడుదల కానుంది. అనిల్ బోయిదాపు దర్శకత్వంలో, వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు. జోరుగా జరుగుతున్న ప్రమోషన్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
ఇటీవల జరిగిన ప్రమోషన్స్ లో నటుడు సాయికుమార్ సినిమా టెక్నికల్ టీమ్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దర్శకుడు అనిల్ బోయిదాపు, సినిమాటోగ్రాఫర్ రవికిరణ్ బోయిదాపుల అనుబంధాన్ని “కృష్ణార్జునులు” అని అభివర్ణించారు. వీరిద్దరి మధ్య సమన్వయం అద్భుతమైన విజువల్స్‌ను అందించిందని, సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళిందనీ చెప్పారు.

అనిల్ దర్శకత్వం, రవికిరణ్ ఫ్రేమింగ్ కృష్ణార్జునుల్లా ఒక్కటిగా పనిచేస్తాయని సాయికుమార్ అన్నారు. ఈ సమన్వయం వల్లే ఫాంటసీ, పీరియడ్ సినిమాల్లో అరుదుగా కనిపించే లావిష్ విజువల్స్ వచ్చాయని అన్నారు. నాచురల్ లైటింగ్, వైడ్ ఫ్రేమ్స్‌తో కాలేజ్ సన్నివేశాలు, అందమైన నేపథ్యాలను చాలా చక్కగా చిత్రీకరించారని తెలిపారు.
రవికిరణ్ సినిమాటోగ్రఫీ, అనిల్ కథనం ఈ సినిమాకు ప్రధాన బలాలుగా ప్రమోట్ చేస్తున్నారు. మైత్రీ పంపిణీతో రాజా ది రాజా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. జూలై 17న తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ టాక్ వస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు.

