Fashion Designer Bhavana Polepalli

Fashion Designer Bhavana Polepalli: నా ప్రతిభను, నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ఉదయభాను గారికి థాంక్స్

Fashion Designer Bhavana Polepalli: గతంలో కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మించిన ప్రముఖ యాంకర్, నటి, నిర్మాత ఉదయభాను గారు మొదటిసారి ఒక సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం జీ5లో స్టీమ్ అవుతున్న పంచనామా సిరీస్ ను ఆమె ఎంతో ప్యాషన్ గా నిర్మించారు. మోహన్ శ్రీవత్స దర్శక ముగించిన ఈ 6 ఎపిసోడ్ల సిరీస్ సెప్టెంబర్ 11వ తేదీ నుండి జీ5లో స్ట్రీమింగ్ లో ఉంది. పంచనామా సిరీస్ స్ట్రీమింగ్ దగ్గరైన సమయంలో ఈ సిరీస్ బృందం ప్రివ్యూ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో ఉదయభాను గారు ఈ సిరీస్ కు పని చేసిన ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన భావన పోలేపల్లి గారి గురించి మాట్లాడుతూ… “తన పని పూర్తయిన తరువాత కూడా కంటెంట్ నచ్చడంతో ఈ సిరీస్ పై దృష్టి పెట్టి సెట్స్ లో ఉంటూ నాకు బాగా సపోర్ట్ చేస్తూ భావన ఉండేవారు. వేరే వారు అలా ఉండరు, పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు కాని తను తనకి ఉన్న ప్యాషన్ తో అక్కడే ఉండేది. ఇలాంటి యువత ఇండస్ట్రీలో ఉండాలి. తన కృషికి, తన డెడికేషన్ కు తను జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తుంది” అన్నారు.

ఈ సందర్భంగా ఫ్యాషన్ డిజైనర్ భావన పోలేపల్లి మాట్లాడుతూ… “నేను గతంలో అగ్లీస్టోరీ సినిమాకు కొంత, లైఫ్, థాంక్యూ డియర్ చిత్రాలకు పని చేశాను, ఆ సినిమాలకు అద్భుతమైన కాస్ట్యూమ్స్ అందించాను. నా కష్టపడే తత్వం గుర్తించిన ఉదయ భాను గారు నాకు సెట్ లో పూర్తి స్వేచను ఇచ్చారు. అంత నమ్మకం ఉంచుకుని, నాకు అవకాశం ఇచ్చిన ఉదయ భాను గారికి నేను మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సిరీస్ నిర్మాత ఉదయభాను గారికి, ఆమె భర్త విజయ్ గారికి, ఉదయభాను ప్రొడక్షన్ కు, ప్రొడక్షన్ టీం కు,జీ5 సంస్థకు అలాగే దర్శకుడు మోహన్ శ్రీవత్స గారికి, చీఫ్ కో డైరెక్టర్ బాలకృష్ణ ఇతర సాంకేతిక బృందం వారి అందరికి నాకు సపోర్ట్ చేసినందుకు పేరుపేరునా థాంక్స్. వుమెన్ ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడు ఎన్ని ఛాలెంజెస్ వస్తాయి అనేది దగ్గర ఉండి చూసాను, సినిమా కోసం చాలా కష్టపడి పని చేశాను. ఇప్పటికే వుమెన్ డైరెక్టర్ ఉన్న చిత్ర పరిశ్రమలో ఇలాగే ఎంతో మంది వుమెన్ ప్రొడ్యూసర్స్ రావాలని కోరుకుంటున్నాను. నేటి నుండి జీ5లో స్ట్రీమ్ కానున్న పంచనామా సిరీస్ చూసి ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని, మాలాంటి టెక్నీషియన్స్ వర్క్ గుర్తిస్తారని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది” అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *