Telangana News:

Telangana News: మృత్యుదారిలో ముగ్గురు.. త‌ల్లి తేరుకునేలోగా పిల్ల‌ల‌ను క‌బ‌లించిన మృత్యువు

Telangana News:ఇది మ‌రో ర‌క‌మైన త‌ల్లి క‌థ‌.. కుటుంబ క‌ల‌హాలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహేత‌ర బంధాల కార‌ణంగా కొంద‌రు తల్లులు పేగు తెంచుకొని పుట్టిన పిల్ల‌ల‌ను క‌డ‌తేర్చుతున్న ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల ప‌లుచోట్ల చోటుచేసుకున్నాయి. ఇదీ అలాంటి కోవ‌కు చెందిందే అయినా, ఆ త‌ల్లికి ప్రాణం తీపి గుర్తొచ్చింది. పిల్ల‌ల‌పై ఎన‌లేని ప్రేమ లేచొచ్చింది. పిల్ల‌ల‌ను చంపాల‌ని, తాను త‌నువు చాలించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ది. పిల్ల‌ల‌ను మృత్యువు దారిలో వ‌దిలి, తాను మృత్యువును చేర‌బోయి ప్ర‌యత్నాన్ని చాలించుకున్న‌ది. కానీ, ఈలోగా ఆ పిల్ల‌ల‌ను ఆ మృత్యువు అప్ప‌టికే క‌బ‌లించింది. క‌న్నీరు మున్నీరు కావ‌డం, జీవితాంత వ్య‌థ‌ను భ‌రించ‌డం ఆ మ‌హిళ వంత‌యింది.

Telangana News:మెద‌క్ జిల్లా శివ్వంపేట మండ‌లం దంతాన్‌ప‌ల్లి గ్రామానికి చెందిన వ‌డ్డేప‌ల్లి మ‌మ‌త‌కు మాసాయిపేట‌కు చెందిన స్వామితో వివాహం జ‌రిగింది. వారికి పూజ (7), తేజ‌స్విని (5) ఇద్ద‌రు పిల్ల‌లు క‌లిగారు. రెండేళ్ల క్రితం స్వామి అనారోగ్యంతో చ‌నిపోయాడు. దీంతో ఆ పిల్ల‌ల భార‌మంతా మ‌మ‌త‌పైనే ప‌డింది. ఆర్థికంగా ఇబ్బందుల‌కు గుర‌వ‌సాగింది.

Telangana News:ఈ ద‌శ‌లో ఆర్థిక ఇబ్బందుల‌ను త‌ట్టుకోలేని ఆ మ‌హిళ ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మ‌నుకున్న‌ది. తాను చ‌నిపోతే త‌న పిల్ల‌ల గ‌తేంకాను అని అనుకొని, పిల్ల‌ల‌నూ త‌న‌తోపాటు ఆయువు తీయాల‌ని అనుకున్న‌ది. దీంతో మ‌మ‌త ఇస్లాంపూర్ శివారులోని హ‌ల్దీవాగు వెళ్లి పిల్ల‌ల‌ను ఆ వాగులోకి తోసేసింది. త‌నూ దూకేసింది. ఆ వెంట‌నే ఆమెకు చావుపై విర‌క్తి క‌లిగింది. పిల్ల‌ల‌పై ప్రేమ పుట్టుకొచ్చింది. తేరుకొని పిల్ల‌ల కోసం వెత‌క‌సాగింది. ఈలోగా ఆ పిల్ల‌ల‌ను మృత్యువు క‌బ‌లించేసింది.

Telangana News:సాయం చేయండి.. అంటూ మ‌మ‌త కేక‌లు వేయ‌సాగింది. స్థానికులు వ‌చ్చి త‌ల్లిని ర‌క్షించి వాగులో నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. పిల్ల‌ల‌ను తీసుకురాగా అప్ప‌టికే పిల్ల‌ల‌ను త‌నువులు చాలించారు. పోలీసులు వ‌చ్చి విచారించి కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. చూశారా.. ఇలాంటి ఘ‌ట‌న‌లు పెరుగుతుండ‌టం బాధాక‌రం. కార‌ణాలు ఏవైనా క‌డుపున పుట్టార‌న్న హ‌క్కుతో వారి ప్రాణాల‌ను తీసేయ‌డం ఎంత మాత్ర‌మూ స‌రికాద‌ని మాన‌వ‌తావాదులు అభ్యంత‌రాల‌ను వ్య‌క్తంచేస్తున్నారు.

WordsCharactersReading time

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *