Telangana News: హెచ్‌సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) భూముల్లో ఇన్నాళ్లు చాటుమాటుగా ఉన్న ఓ జింక వర్సిటీ భవనాల వద్దకు వచ్చింది. అక్కడి చెట్లను పెద్ద ఎత్తున నరికేయడంతో బయటకు రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన ఆ జింక హెచ్‌సీయూ క్యాంపస్ ఆవరణలోకి వచ్చి ఎంచక్కా మేత మేసింది. ఈ లోగా అక్కడి కుక్కలు తరుముతూ ఆ జింకపై దాడి చేశాయి. తీవ్రగాయాలపాలైన ఆ జింక ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందినట్టు సిబ్బంది తెలిపారు.
Telangana News: కంచ గచ్చిబౌలిలో గత ఐదు రోజులుగా చెట్లను పెద్ద ఎత్తున నరికేస్తూ వచ్చారు. సుప్రీంకోర్టు స్టే విధించడంతో పనులను గురువారం నుంచి నిలిపివేశారు. దీంతో ఇప్పటి దాకా బుల్డొజర్ల చప్పుళ్ల నడుమ బిక్కుబిక్కుమంటూ ఎక్కడో తలదాచుకున్న ఆ జింకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక జింక శుక్రవారం ఉదయం బయటకు వచ్చింది.
Telangana News: హెచ్‌సీయూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని సౌత్ క్యాంపస్ హాస్టల్ సమీపంలోకి వచ్చిన ఆ జింక, సమీపంలో మనుషులు ఉన్నా కడుపు నిండా మేత మేస్తూ కనిపించింది. దీనిని అక్కడి విద్యార్థులు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. ఎలాంటి జంకు లేకుండా మేత మేసిన ఆ జింక దూరంగా వెళ్లాక కుక్కలు దాడి చేయడంతో తీవ్రగాయాల పాలైంది. గమనించిన అక్కడి విద్యార్థులు, సిబ్బంది దానిని ఓ వాహనంలో తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.