Disha Patani: బాలీవుడ్ గ్లామర్ క్వీన్ దిశా పటానీ.. ఒకప్పుడు తన హాట్ లుక్స్‌తో యూత్‌ను ఊపేసింది! తొలి సినిమాతోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ, తెలుగులో ఆశించిన హిట్స్ రాకపోవడంతో బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యింది. అక్కడ ‘ధోనీ’, ‘భాఘీ 2’, ‘భారత్’తో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. కానీ, సౌత్ సినిమాలకు దూరంగా ఉంటూ ‘మలంగ్’ లాంటి ప్లాప్ తర్వాత కూడా సల్మాన్ ఖాన్ ‘రాధే’లో అవకాశం దక్కించుకుంది. కానీ ఆ సినిమాతో కూడా ఘోరమైన డిజాస్టర్ ఎదుర్కొంది. ఆ తర్వాత ‘ఏక్ విలన్ రిటర్న్స్’, ‘యోధ’ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో దిశా కెరీర్ డౌన్‌ఫాల్‌లో పడిపోయింది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో ప్రభాస్‌తో ‘కల్కి 2898 ఏడీ’తో బ్లాక్‌బస్టర్ అందుకుని రీ-ఎంట్రీ ఇచ్చింది. కానీ, సూర్య ‘కంగువా’ మళ్లీ నీరసం తెప్పించింది. ఇప్పుడు దిశా చేతిలో ‘వెల్కమ్ టు ద జంగిల్’ ఒక్కటే ఉంది, అదీ పోస్ట్‌పోన్‌మెంట్స్‌తో సందిగ్ధంలో పడింది. సిద్ధాంత్ చతుర్వేదితో సినిమా టాక్ ఉన్నా, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. గ్లామర్‌లో టాప్‌లో ఉన్నా, ఆఫర్లు దూరమవుతున్నాయి. ‘అందాల ఆరబోత ఓకే కానీ నటన కూడా కావాలి’ అంటూ ఇండస్ట్రీలో చర్చలు జోరందుకున్నాయి. మరి దిశా కెరీర్ ఇక ఎటు సాగుతుందో.. టైమ్ మాత్రమే చెప్పాలి!
