Hyderabad: తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నేతలు మూసీ వెంట నిద్రించలని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను బీజేపీ నేతలు స్వీకరించారు. మూసీ పరీహవాక ప్రాంతాల్లోని బస్తీలలో బస చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు 20 మంది బీజేపీ ముఖ్య నేతలు వివిధ ప్రాంతాల్లో బస చేయనున్నారు. రాత్రి భోజనం, రాత్రి నిద్ర, మరుసటి రోజు అల్పాహారం అక్కడే చేయనున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ప్రజలతో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ మనోధైర్యం ఇవ్వనున్నారు.
ఎవరెవరు ఎక్కడేక్కడంటే..అంబర్‌పేటలోని తులసీరాంనగర్‌లో కిషన్ రెడ్డి, ఎల్బీ నగర్‌లోని గణేశ్ నగర్‌లో ఈటల రాజేందర్,ఓల్డ్ మలక్‌పేటలోని శాలివాహననగర్‌లో కే లక్ష్మణ్, రాజేంద్రనగర్‌లోని హైదర్‌షా కోటలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అఫ్జల్‌గంజ్‌లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో బీబీ పాటిల్ బస చేయనున్నారు.