Telangana: తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై రాష్ట్రంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కవులు, కళాకారులు, మేధావులు విగ్రహ మార్పును వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో నూతన తెలంగాణ విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ ప్రముఖ కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
Telangana: డిసెంబర్ 9న సచివాలయంలో నూతన తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠాంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దానిని నిలుపుదల చేయాలని గౌరీశంకర్ ఆ పిల్‌లో కోర్టును కోరారు. ఈ మార్పులు తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నామని పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు పేర్కొంటున్నారు.