Tamilnadu:

Tamilnadu: మాజీ గ‌వ‌ర్న‌ర్ ఇంట విషాదం.. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత క‌న్నుమూత‌

Tamilnadu: తెలంగాణ మాజీ గ‌వర్న‌ర్, బీజేపీ త‌మిళ‌నాడు నాయ‌కురాలు త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ ఇంటిలో విషాదం నెల‌కొన్న‌ది. ఆయ‌న తండ్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌ముఖ సాహితీవేత్త అయిన‌ శ్రీ కుమారి అనంత‌న్ (హ‌రికృష్ణ‌న్ నాడార్ అనంత‌కృష్ణ‌న్) క‌న్నుమూశారు. దీంతో త‌మిళ‌నాడులో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. శ్రీ కుమారి అనంత‌న్ మృతికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తంచేశారు. మ‌హాత్ముడి సిద్ధాంతాల‌ను పునికి పుచ్చుకున్న దేశ‌భ‌క్తుడు, త‌మిళ భాషా ప్రేమికుడు అనంత‌న్ గారిని కోల్పోవ‌డం ఎంతో బాధాక‌రం అని పేర్కొన్నారు.

Tamilnadu: కుమారి అనంత‌న్ నాలుగుసార్లు శాస‌న‌స‌భ‌కు, ఒక‌సారి పార్ల‌మెంట్ స‌భ్యుడిగా కూడా ఎన్నికై ప్ర‌జ‌ల‌కు విశేష సేవ‌లందించారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘ‌కాలంగా కొన‌సాగుతూ వ‌స్తున్నారు. తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న త‌మిళిసై గారికి, వారి కుటుంబ స‌భ్యుల‌కు ముఖ్య‌మంత్రి ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తంచేశారు. అనంత‌న్ ఆత్మ‌కు శాంతించాల‌ని సీఎం స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *