Superman: ఇవాళ్టి తరానికి ‘స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఆక్వామాన్’ అంటే అమిత ఇష్టం. నిజానికి వీళ్ళందరికంటే ముందే ప్రపంచవ్యాపంగా సినీ అభిమానులను చూరగొన్నది ‘సూపర్ మ్యాన్’. 1948 నుండి ‘సూపర్ మ్యాన్’ హంగామా మొదలైంది. తాజాగా ఈ ఫ్రాంచైజీలో మరో సినిమా రాబోతోంది. డేవిడ్ కొరెన్స్ వెట్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలైంది.
ఇది కూడా చదవండి: Ajay Devgn: ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు.
Superman: తన కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి సూపర్ మ్యాన్ చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది. డీసీ యూనివర్స్లోని ఫిల్మ్ సిరీస్ లకు రీబూట్ వెర్షన్ గా రానున్న ఈ చిత్రంలో రెచెల్ బ్రోస్ నహన్, ఇసబెలా మెర్సిర్, ఆంటోనీ కారిగ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో వచ్చే యేడాది జూలై 11న విడుదల కాబోతోంది.