Salaar Re Release

Salaar Re Release: రీరిలీజ్ లో సలార్ కు సూపర్ ఓపెనింగ్స్!

Salaar Re Release: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం సలార్. అప్పట్లో రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం మళ్ళీ రీరిలీజ్ కి వచ్చింది. ఈసారి మాత్రం క్రేజీ ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకోవడం విశేషం. ఇలా సలార్ రీరిలీజ్ లో మొదటి రోజు ఏకంగా 3.24 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో సలార్ మళ్ళీ అదరగొట్టిందని చెప్పవచ్చు. మరి ఫుల్ రన్ లో సలార్ రీరిలీజ్ ఎన్ని కోట్ల వద్ద ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే మేకర్స్ సలార్ పార్ట్ 2 ని కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్ట్ 2 వర్క్స్ జరుగుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Crime News: యువకుడు దారుణ హత్య..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *