IPL 2025

IPL 2025: ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా..!

IPL 2025: ఈ జట్టుకు ఓపెనర్లుగా పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ఉంటారు. వీరిద్దరు గతంలో ఢిల్లీ క్యాపిటల్కు కలిసి ఆడారు. ఐపీఎల్లో డేవిడ్ వార్నర్కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అయినా ఈసారి ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తి చూపలేదు. వయసు పైబడటం, పెద్దగా ఫామ్లో లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు.

పృథ్వీ షా విషయానికొస్తే.. ఈ ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఓపెనర్ ఐపీఎల్లో 79 మ్యాచ్లు ఆడి 147.5 స్ట్రయిక్తేట్తో 1892 పరుగులు చేశాడు. అయితే షా గత కొన్ని సీజన్లుగా పెద్దగా పెర్ఫార్మ్ చేయడం లేదు. అందుకే అతన్ని ఈసారి వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. పైగా షా ఓవర్ వెయిట్ అయ్యాడు. అతనిపై ఫ్రాంచైజీలు అనాసక్తి చూపడానికి ఇదీ ఒక కారణం అయ్యి ఉండవచ్చు.

IPL 2025: వన్ఎన్ విషయానికొస్తే.. ఈ స్థానంలో విండీస్ ఆటగాడు కైల్ మేయర్ను ఆడిస్తే బాగుంటుంది. మేయర్స్ గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు ఆడాడు. మేయర్స్పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడానికి పెద్ద కారణాలేమీ లేవు. నాలుగో స్థానం విషయానికొస్తే.. ఈ స్థానంలో స్టీవ్ స్మిత్ ఆడితే బాగుంటుంది. స్టీవ్్కు పొట్టి ఫార్మాట్లో సరైన ట్రాక్ రికార్డు లేకపోవడం వల్ల అతను అమ్ముడుపోలేదు.

ఐదో స్థానంలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ వస్తే బాగుటుంది. బెయిర్హో ఇటీవలి కాలంలో పెద్దగా ఫామ్లో లేకపోవడం వల్ల అతన్ని ఏ జట్టు ఎంపిక చేసుకోలేదు. ఆరో స్థానంలో జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజా ఆడితే బాగుంటుంది. ఏడో స్థానంలో సౌతాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్.. ఎనిమిదో స్థానంలో విండీస్ ఆటగాడు అకీల్ హెుసేన్ బరిలోకి దిగితే బాగుంటుంది.

IPL 2025: స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఆదిల్ రషీద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.. స్పెషలిస్ట్ పేసర్లుగా ఉమేశ్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ బరిలోకి దిగితే ఐపీఎల్ మెగా వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్లతో పటిష్టమైన జట్టు రూపుదిద్దుకుంటుంది

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  OYO Rooms: ఆ ప్రూఫ్ లేకపోతే నో రూమ్.. జంటలకు షాక్ ఇచ్చిన ఓయో రూమ్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *