Srisailam: పండుగ కోసం కర్నూలులో ఎంతో ఆనందంగా దంపతులు షాపింగ్ చేశారు.. కానీ బస్సు రూపంలో మృతువు ఎదురుపడటంతో ఆ దంపతులకు తీరని ఎడబాటు మిగిల్చింది. కర్నూలులో షాపింగ్ చేసిన తర్వాత కారులో కర్నూలు నుంచి బయలుదేరి మరో గంటలో శ్రీశైలంలోని ఇంటికి చేరుకుంటామనుకున్న తరుణంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో చిన్నారి జోషిక తల్లిని కోల్పోయింది. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న ఇన్‌ఛార్జ్ ఎస్‌ఐ అనిల్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Srisailam: టూరిస్ట్ బస్సును కారు వేగంగా ఢీకొన్న ప్రమాదంలో శ్రీశైలం దేవస్థానం వైద్యశాలలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న మహిళ మృతి చెందగా.. ఆమె భర్త, ఐదేళ్ల కుమారైలు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన శ్రీశైలం రహదారిలోని నల్లవాగు వంతెన సమీపంలో చోటుచేసుకుంది.ఈ ఘటనలో నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చెందిన మురహరి మల్లిక మృతి చెందగా, ఆమె భర్త బాబూరావు, కుమారై జోషికలకు స్వల్ప గాయాలయ్యాయి.
ఇది కూడా చదవండి: Revanth Reddy: ఒకే దెబ్బకు రెండు పిట్టలు… రేవంత్ మాస్టర్ ప్లాన్
Srisailam: మృతురాలు దేవస్థానం వైద్యశాలలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తుండగా, ఆమె భర్త బాబూరావు ఏపీ ట్రాన్స్‌కో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేసే లోపే మల్లిక మృతి చెందగా, గాయపడిన తండ్రి, కుమారైలకు వైద్య పరీక్షలు చేశారు.
Srisailam: బస్సు ఢీకొన్న వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో బాబూరావు, కుమారై జోషికలు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బాబూరావు కారు నడుపుతుండగా కుమారై జోషిక తండ్రి పక్కనే ముందు సీట్లో కూర్చొని ఉంది. ప్రమాద సమయంలో కారు ముందుగా వెళ్తున్న బస్సును బలంగా ఢీకొట్టడంతో కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. వెనుక సీట్లో కూర్చున్న మల్లిక తల ముందు సీటుకు కొట్టుకోవడంతో మృతి చెందినట్లు భావిస్తున్నారు.