Krishna Janmashtami 2026: దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భాద్రపద మాస కృష్ణ పక్ష అష్టమి తిథి, రోహిణి నక్షత్ర కలయికతో కూడిన ఈ పర్వదినాన శ్రీకృష్ణుడి 5253వ జన్మోత్సవాన్ని భక్తులు జరుపుకుంటున్నారు. సకల జగత్తును తన లీలలతో మురిపించిన చిన్ని కృష్ణుడిని తమ ఇంట్లోనే కొలువుదీర్చి లడ్డూ గోపాలుడికి విశేష పూజలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. రోజంతా ఉపవాస దీక్ష ఆచరించి, కన్నయ్య జన్మించిన అర్ధరాత్రి వేళ స్వామివారిని పూజిస్తే సకల పాపాలు తొలగి, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వసిస్తారు.
అర్ధరాత్రి పూజకు 45 నిమిషాల శుభ ముహూర్తం..
లడ్డూ గోపాల్ పూజా విధానం & విశేష అలంకరణ..
-
పంచామృతాభిషేకం:అర్ధరాత్రి వేళ లడ్డూ గోపాల్‌ను పవిత్ర గంగాజలం, పంచామృతాలతో (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర/గంగాజలం) శాస్త్రోక్తంగా అభిషేకించాలి. కుంకుమపువ్వు కలిపిన పాలతో అభిషేకం చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.
-
బాలగోపాలుడి శృంగారం:అభిషేకం పూర్తయిన తర్వాత స్వామికి నూతన పట్టు వస్త్రాలు, ఆభరణాలు, నెమలి పింఛం, చేతికి వేణువు ధరింపజేసి పూలతో సుందరంగా అలంకరించాలి. అనంతరం స్వామివారిని ఉయ్యాలలో ఉంచి భక్తితో జోలపాడుతూ ఊపాలి.
-
ప్రీతిపాత్రమైన నైవేద్యాలు:కన్నయ్యకు అమిత ఇష్టమైన తాజా వెన్న-మిశ్రి (కలకండ), ధనియాల పంజిరి, పండ్లు, రకరకాల పిండివంటలు సమర్పించాలి. నైవేద్యంలో తులసి దళాలను ఉంచడం అత్యంత ఆవశ్యకం.
పఠించాల్సిన మంత్రాలు – పరిహారాలు..
-
నామస్మరణ:పూజా సమయంలో “ఓం క్లీం కృష్ణాయ నమః”, “కృం కృష్ణాయ నమః” లేదా “హరే కృష్ణ” మహామంత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి జపించాలి.
-
ఆర్థిక సమస్యల నివారణకు తాంబూలం:
రాత్రి పూజలో కృష్ణుడికి తాంబూలం (తమలపాకు) సమర్పించి, మరుసటి రోజు ఆ ఆకుపై కుంకుమతో ‘శ్రీయంత్రం’ గీసి బీరువా లేదా ధనం దాచే స్థానంలో ఉంచితే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
