GV Prakash Kumar

GV Prakash Kumar: జీవీకి శివకార్తికేయన్ ఖరీదైన వాచ్ గిఫ్ట్!?

GV Prakash Kumar: శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ఘన విజయం సాధించింది. ఇందులో సాయిపల్లవి పోషించిన ఇందు రెబెక్కా వర్గీస్ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ తో కలసి రాజ్ కమల్ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ నిర్మించారు. ‘డాక్టర్, డాన్’ సినిమాలతో వరుస విజయాల మీదున్న శివకార్తికేయన్ ఖాతాలో మరో హిట్ గా నిలిచింది ‘అమరన్’. ఇక ఈ సినిమా విజయంలో జీవీ ప్రకాశ్ అందించిన పాటలు, ఆర్ఆర్ కూడా కీలక పాత్ర పోషించాయి. తన మ్యూజిక్ తో సినిమాను నిలబెట్టిన జీవీ ప్రకాశ్ తాజాగా శివకార్తికేయన్ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. లక్షల విలువ చేసే బ్రాండెడ్ వాచ్ ను బహుమతిగా పంపించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో జీవీ ప్రకాశ్ షేర్ చేశాడు. ఇప్పుడది వైరల్ అవుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  దివ్వెల మాధురి రీల్ యాక్షన్.. కేసు పెట్టిన టీటీడీ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *