Sivakarthikeyan

Sivakarthikeyan: 300 కోట్ల క్లబ్ లో శివకార్తికేయన్!?

Sivakarthikeyan: శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘అమరన్’. తమిళనాడుకు చెందిన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కిన ‘అమరన్’ ను సోనీ పిక్చర్స్ తో కలసి రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ నిర్మించగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. దీపావళి కానుకంగా ఈ సినిమా తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. మొదటి రోజే పాజిటీవ్ టాక్ తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్లను వసూలు చేసింది. శివకార్తికేయన్ ముకుంద్ వరదరాజన్ గా నటించగా ఆయన భార్య ఇందు రెబక్కా వర్గీస్ గా సాయిపల్లవి నటించింది.

Sivakarthikeyan: జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఇక దీపావళికి రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ లో నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ డీసెంట్ వసూళ్ళను సాధిస్తూ తాజాగా 300 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ నేపథ్యంలో శివకార్తికేయన్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించి తమిళనాట కాబోయే సూపర్ స్టార్ అనే గుర్తింపు తెచ్చిపెట్టింది. శివకార్తికేయన్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా కూడా హిట్ అయితే లేటెస్ట్ సూపర్ స్టార్ శివకార్తికేయన్ అవుతాడనటంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *