Siva Karthikeyan

Siva Karthikeyan: శివ కార్తికేయన్ మూవీ టైటిల్ ఖరారు!

Siva Karthikeyan: పలు అనుమానాల నడుమ హీరో శివ కార్తికేయన్, డైరెక్టర్ సుధా కొంగర సినిమా మొదలైంది. ఇద్దరి మధ్య ఇగో క్లాషెస్ వచ్చాయని, మూవీ ఆగిపోయిందనే వార్తలకు చెక్ పెడుతూ ఇటీవల దీని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పీరియాడిక్ మూవీలో చెన్నయ్ లో జరిగిన హిందీ భాషా వ్యతిరేక ఉద్యమం గాథను చెప్పబోతున్నారట. దానికి తగ్గట్టుగానే ఈ మూవీకి ‘1965’ అనే పేరు పెట్టబోతున్నారని, ఆ మధ్య వచ్చిన మలయాళ చిత్రం ‘2018’ దీనికి ప్రేరణ అని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Iphone 16: భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధర, అస్సలు మిస్ చేసుకోకండి

Siva Karthikeyan: టివినో థామస్ నటించిన ఆ సినిమా ఆ యేడాది జరిగిన ఓ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడీ సినిమా కూడా 1965 నాటిది కావడంతో ఆ టైటిల్ లాక్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఈ సినిమాతోనే శ్రీలీల తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. ఇటీవల ‘అమరన్’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న శివ కార్తికేయన్ కు ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Baaghi-4: 'బాఘీ -4' ఎప్పుడంటే....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *